ETV Bharat / bharat

భయంతో టీకాలకు దూరంగా 18వేల ఉద్యోగులు - ఏఏఈయూ

టీకాలపై నెలకొన్న అనుమానాలతో వ్యాక్సినేషన్​కు ముందుకు రావడంలేదు భారత విమానాశ్రయ సంస్థ ఉద్యోగులు. టీకా తీసుకోవాలని ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయనే భయంతో దూరంగా ఉంటున్నారు.

COVID-19 vaccine, AAI
కరోనా టీకా, ఏఏఈయూ
author img

By

Published : Apr 15, 2021, 7:34 PM IST

కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న వేళ.. టీకా తీసుకోవాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. అయితే వ్యాక్సన్​పై నెలకొన్న భయం, ఆందోళనల కారణంగా ముందుకు రావడంలేదు ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ఉద్యోగులు. టీకా తీసుకోవాలని ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఎంప్లాయిస్ యూనియన్​(ఏఏఈయూ)కు చెందిన 18 వేల మంది ఉద్యోగులను ఎన్ని సార్లు కోరినా.. వారు అనుమానాలను వీడటం లేదని సంఘం ప్రధాన కార్యదర్శి బాల్​రాజ్ సింగ్ తెలిపారు.

"దేశవ్యాప్తంగా ఏఏఈయూలో 18 వేల మంది ఉద్యోగులున్నారు. వారిలో 45 ఏళ్ల పైబడినవారు 12వేల మంది ఉన్నారు. టీకా తీసుకుంటే.. సైడ్​ ఎఫెక్ట్స్​, మరోసారి వైరస్​ బారిన పడతామనే భయం, ఆందోళన వారిలో నెలకొంది. నా భార్యతో కలిసి ఇటీవల వ్యాక్సిన్ వేయించుకున్నా. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అందరూ సత్వరమే టీకాలు తీసుకోవాలి."

-బాల్​రాజ్ సింగ్​, ఏఏఈయూ ప్రధాన కార్యదర్శి

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పని ప్రదేశాల్లో 100 మందికి పైగా అర్హులతో టీకా కార్యక్రమం చేపట్టవచ్చని ఇటీవల కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్​ కోసం కనీసం 100 మంది ఉద్యోగులు కూడా సిద్ధంగా లేకపోవడం వల్ల వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటు చేయలేకపోతున్నట్లు బాల్​రాజ్​ తెలిపారు. ప్రస్తుతం కోల్​కతా, గువాహటిలో ఈ క్యాంపులు నడుస్తున్నా.. సిబ్బంది ఆసక్తి చూపడంలేదని చెప్పారు.

ఇదీ చూడండి: టీకా ఉత్సవ్​: 3 రాష్ట్రాల్లో కోటి మందికి టీకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.