COVAXIN universal vaccine: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అరుదైన ఘనత సాధించింది. చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న ఈ టీకా 'యూనివర్సల్ వ్యాక్సిన్‌గా'గా గుర్తింపు పొందిందని భారత్ బయోటెక్ ప్రకటించింది.
"కొవాగ్జిన్ ఇప్పుడు చిన్నారులు, వయోజనులకు యూనివర్సల్ వ్యాక్సిన్. కొవిడ్‌కు గ్లోబల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలన్న మా లక్ష్యం నెరవేరింది. టీకా అభివృద్ధి, లైసెన్సులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి" అని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది.
India vaccination Covaxin
2021 జనవరిలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌లో 154 కోట్లకు పైగా కొవిడ్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో 12 శాతం టీకాలు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ డోసులు ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
పూర్తి స్థాయి అనుమతుల కోసం దరఖాస్తు
Covaxin regular market approval: ప్రస్తుతం 15-18 ఏళ్ల వయస్కులకు ప్రారంభించిన కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలోనూ కొవాగ్జిన్‌నే ఉపయోగిస్తున్నారు. కొవాగ్జిన్‌కు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇవ్వాలని భారత్ బయోటెక్.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరుతూ లేఖ రాసిన రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. ముందస్తు క్లినికల్, క్లినికల్ డేటా సహా, తయారీ, రసాయన సంబంధిత సమాచారాన్ని ఐదు మాడ్యూళ్లలో సమర్పించినట్లు భారత్ బయోటెక్ డీసీజీఐకు వివరించింది. ఈ వివరాలను సుగమ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసినట్లు తెలిపింది. వీటిని పరిశీలించి, వీలైనంత త్వరగా పూర్తిస్థాయి అనుమతులు జారీ చేయాలని డీసీజీఐను కోరింది.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి.. మరోసారి 45వేలకు పైగా కేసులు