కరోనా వైరస్‌పై కొవాగ్జిన్ టీకా 77.8శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణుల కమిటీ సమీక్షలో తేలినట్టు సమాచారం. మూడో దశ ట్రయల్స్‌లో ఈ విషయం స్పష్టమైనట్టు తెలుస్తోంది.
కొవాగ్జిన్ టీకా వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతి ప్రక్రియకు ముందు.. ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీకా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ డేటాను డీసీజీఐకు భారత్ బయోటెక్ సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.