ETV Bharat / bharat

'సెప్టెంబర్​ నాటికి కొవాగ్జిన్​ ఉత్పత్తి 10 రెట్లు పెంపు' - కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తి

దేశీయ టీకా అయిన కొవాగ్జిన్​ ఉత్పత్తిని ఈ ఏడాది సెప్టెంబర్​ నాటికి 10 రెట్లు పెంచనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. కరోనాపై బాగా పని చేస్తోన్న రెమిడెసెవిర్​ ఉత్పత్తులను కూడా గణనీయంగా పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Covaxin production, harsha vardhan
'సెప్టెంబర్​ నాటికి 10 రెట్లు పెరగనున్న కొవాగ్జిన్​ ఉత్పత్తి'
author img

By

Published : Apr 19, 2021, 6:06 AM IST

Updated : Apr 19, 2021, 6:46 AM IST

సెప్టెంబర్​ నాటికి కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తి 10 రెట్లు పెరుగుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. కరోనాపై తీవ్ర ప్రభావం చూపుతున్న మరో ఔషధం రెమిడెసెవిర్​ తయారీ మే నుంచి నెలకు 74.1 లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు.

కరోనాతో పోరాటంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమాన మద్దతు అందిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆక్సిజన్​తో పాటు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్​ చేశారు.

"మే నాటికి రెమిడెసెవిర్​ ఉత్పత్తి నెలకు 74.1 లక్షలకు పెరుగుతుంది. ఇందుకోసం 20 కంపెనీలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చాం. ఎగుమతులను నిషేధించాం. ధరలను కూడా తగ్గించాం. బ్లాక్​ మార్కెట్​పై కూడా తగిన చర్యలు చేపట్టాం."

- హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

ఇదీ చూడండి: పరిశ్రమలకు ఆక్సిజన్​ సరఫరాపై కేంద్రం నిషేధం!

Last Updated : Apr 19, 2021, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.