ETV Bharat / bharat

'కొవాగ్జిన్​ సేఫ్​.. దుష్ప్రభావాలు లేవు'

కరోనా నుంచి రక్షణ కోసం దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్ టీకా​ సురక్షితమైందని ఓ అధ్యయనంలో తేలింది. దాని ద్వారా ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని వెల్లడైంది.

Covaxin phase 2 data shows vaccine safe, induces immune response: Lancet Study
కొవాగ్జిన్​ సురక్షితమేనా.. దుష్ప్రభావాలు లేవా?
author img

By

Published : Mar 9, 2021, 5:59 PM IST

భారత్​లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా టీకా సురక్షితమైందని ఓ అధ్యయనం చెబుతోంది. కొవాగ్జిన్​ ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా రోగనిరోధక ప్రతిస్పందన కలిగిస్తుందని 'ది లాన్సెట్​ ఇన్ఫెక్షియస్ డిసీజెస్' జర్నల్ తెలిపింది. కొవాగ్జిన్ టీకాపై రెండో దశ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర ఫలితాలను ఈమేరకు వెల్లడించింది. అయితే ఈ అధ్యయనంలో బీబీవీ152 వ్యాక్సిన్​ సమర్థతను అంచనా వేయలేదని పరిశోధకులు తెలిపారు.

కొవాగ్జిన్​ను హైదరాబాద్​కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇన్​స్టిట్యూట్(ఎన్ఐవీ)తో కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసింది.

కొవాగ్జిన్​ టీకా 81శాతం సమర్థంగా పనిచేస్తోందని ఇటీవల భారత్​ బయోటెక్ ప్రకటించింది.

ఇదీ చూడండి: కొవాగ్జిన్ టీకాతో మోదీ ఇచ్చిన సందేశమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.