ETV Bharat / bharat

ఆప్​ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలుశిక్ష

ఎయిమ్స్​ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన కేసులో భాగంగా ఆప్​ ఎమ్మెల్యే సోమనాథ్​ భారతికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది దిల్లీ మెట్రో పాలిటన్​ కోర్టు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు సోమనాథ్​.

AAP MLA Somnath Bharti to 2 years in jail
ఆప్​ ఎమ్మెల్యే సోమనాథ్​ భారతికి రెండేళ్లు జైలుశిక్ష
author img

By

Published : Jan 23, 2021, 8:14 PM IST

దిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది దిల్లీ మెట్రో పాలిటన్ కోర్టు. శనివారం ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా వెంటనే బెయిలు కూడా మంజూరు చేసింది.

2016 సెప్టెంబర్‌లో సోమనాథ్ భారతి సహా మరో 300 మంది కలిసి జేసీబీ సాయంతో ఎయిమ్స్ ప్రహరీకి ఉన్న కంచెను తొలగించారు. ఈ క్రమంలో అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసినట్టు ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్​ఎస్​ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు సోమనాథ్ భారతిని దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగత్ సైనీ, దిలీప్ ఝా, సందీప్ సోను, రాకేశ్ పాండేనూ తగిన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషులుగా ప్రకటించింది.

కోర్టు తీర్పుపై స్పందించిన ఆప్‌... న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నామని, ఈ కేసు విషయంలో సోమ్​నాథ్​కు అన్యాయం జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు తెలిపిన సోమ్ నాథ్.. హైకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:10ఏళ్ల కుమార్తెపై పైశాచికం- తండ్రి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.