ETV Bharat / bharat

మైనర్​గా ఉన్నప్పుడు భార్యపై అత్యాచారం- దోషికి 20 ఏళ్ల జైలు.. బాధితురాలి ట్విస్ట్! - ఒడిస్సాలో పోక్సో చట్టం

వివాహం జరగక ముందు మైనర్​గా ఉన్న తన భార్యపై అత్యాచారం చేసినందుకు ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దోషిగా తేలిన అతడికి రూ.10వేల జరిమానా సైతం విధించింది కోర్టు. మరోవైపు, గంజాయి కొనేందుకు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తిపై యాసిడ్​ పోసిన ఘటన బిహార్​లో జరిగింది.

bihar
బీహార్
author img

By

Published : Nov 2, 2022, 10:26 PM IST

తన భార్యపై అత్యాచారం చేసినందుకు ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెళ్లి కాక ముందు మైనర్​గా ఉన్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడినందుకు ఒడిశాలోని ఓ ఫాస్ట్​ట్రాక్​ కోర్ట్​ ఈ శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే...
ఒడిశా అంగుల్​ జిల్లాకు చెందిన గోబర్ధన్ నాయక్.. బనర్పల్​ ప్రాంతానికి చెందిన మైనర్​పై 2016లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలిక 2021 జనవరిలో తన తల్లిదండ్రులతో కలిసి గోబర్ధన్​పై పోలీసు స్టేషన్​లో కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

గోబర్ధన్ నాయక్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం అతన్ని జైలు పంపారు. బెయిల్​పై బయటకు వచ్చిన గోబర్ధన్​ నాయక్ గత సంవత్సరం జూలైలో.. మేజర్ అయిన బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా కేసు విచారణ పూర్తి కాగా.. జిల్లా కోర్టు న్యాయమూర్తి.. గోబర్ధన్​కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇలాంటి నేరాలు పిల్లల మనసులో చెరగని ముద్ర వేస్తాయని పేర్కొన్న న్యాయమూర్తి.. దోషికి రూ.10వేల జరిమానా సైతం విధించారు. గోబర్ధన్​ నాయక్ తరపు న్యాయవ్యాది రబీంద్రనాథ్​ మాట్లాడుతూ జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తు తాము ఒరిస్సా హైకోర్టుకు వెళుతున్నట్లు తెలిపారు.

అయితే, బాధితురాలు మాత్రం తన భర్తను వెనకేసుకొచ్చింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే కేసు పెట్టానని చెబుతోంది. "మేమిద్దరం కొన్నాళ్లుగా ప్రేమించుకున్నాం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా. మా కుటుంబం ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో నా భర్తపై కేసు పెట్టాను. అందుకు అతడు జైలుకు వెళ్లాడు. నా భర్త మళ్లీ నా జీవితంలోకి రావాలి. అతడు అమాయకుడు" అని బాధితురాలు చెప్పుకొచ్చింది.

వ్యక్తిపై యాసిడ్ దాడి:
గంజాయి కోసం చేసిన అప్పు తీర్చలేదని.. ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సుపాల్‌ జిల్లా కిషన్‌పుర్​లోని కత్రా గ్రామానికి చెందిన అర్జున్ ముఖియా.. అదే గ్రామానికి చెందిన గణేష్ స్వర్ణకర్ దగ్గర గంజాయి, మద్యం కోసం రూ.950 అప్పు చేశాడు. బుధవారం ఉదయం అర్జున్ ముఖియా గంజాయి కోసం గణేష్ స్వర్ణకర్ ఇంటికి వెళ్లాడు. అప్పు చెల్లించలేదని గణేష్.. అర్జున్ ముఖియాపై యాసిడ్‌తో దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అర్జున్ ముఖియాను అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లాలోని సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన కిషన్‌పూర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

arjun mukiya
అర్జున్ ముఖియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.