ETV Bharat / bharat

కెమిస్ట్​ హత్య.. స్నేహితులదే కుట్ర.. ఆ ఎన్​జీఓ కేంద్రంగానే అంతా.. దర్యాప్తు వేగవంతం!

Amravati Chemist Umesh Kolhe: మహారాష్ట్ర అమరావతిలోని మందుల దుకాణం యజమాని ఉమేశ్​ ప్రహ్లాద్​రావు కోల్హే (54) హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు. మాస్టర్​మైండ్​గా భావిస్తున్న ఇర్ఫాన్​ ఖాన్​కు 7 రోజుల పోలీస్​ కస్టడీ విధించింది కోర్టు. భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్​ శర్మ.. వివాదాస్పద వ్యాఖ్యలను కెమిస్ట్ ఉమేశ్​ సామాజిక మాధ్యమాల్లో సమర్థించారని, ఆయన హత్యకు ఆ పోస్టుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు.

Court remands Amravati chemist's killing 'mastermind' in police custody till July 7

author img

By

Published : Jul 3, 2022, 8:02 PM IST

Amravati Chemist Umesh Kolhe: అమరావతిలోని కెమిస్ట్​ ఉమేశ్​ ప్రహ్లాద్​రావు కోల్హే హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న ఇర్ఫాన్​ ఖాన్​కు.. జులై 7 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. ఈ కేసులో ఏడో నిందితుడిగా అరెస్టయ్యాడు షేక్​ ఇర్ఫాన్​ షేక్​ రహీం అలియాస్​ ఇర్ఫాన్​ ఖాన్​. నాగ్​పుర్​లో శనివారం ఇతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టారు.

ఇర్ఫాన్​ ఖాన్​ ఓ ఎన్​జీఓ డైరెక్టర్​ అని, ఆ స్వచ్ఛంద సంస్థ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముదాసర్​ అహ్మద్​ అలియాస్​ సోను రజా షేక్​ ఇబ్రహీం (22), షారుక్​ పఠాన్​ అలియాస్​ బాద్షాషా హిదాయత్​ ఖాన్ (25), అబ్దుల్​ తౌఫిక్​ అలియాస్​ నాను షేక్​ తస్లీమ్​ (24), షోయబ్​ ఖాన్​ అలియాస్​ భూర్య సబీర్​ ఖాన్ ​(22), అతిబ్​ రషీద్​ ఆదిల్​ రషీద్​ (22), డా. యూసుఫ్​ ఖాన్​ బహదూర్​ ఖాన్​ను (44) అరెస్టు చేశారు. ఇందులో నలుగురు ఇర్ఫాన్​ ఖాన్​ స్నేహితులు. వీరంతా.. అతడి ఎన్​జీఓ కోసమే పనిచేస్తున్నట్లు తెలిసింది. అరెస్టైన వారిలో ఒకరైన యూసుఫ్​ ఖాన్​ వెటర్నరీ డాక్టర్.. చనిపోయిన కోల్హే వెటర్నరీ మెడికల్​ షాప్​ ఓనర్​. ఈ ఇద్దరికీ వ్యాపార సంబంధాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ​

ఆ పోస్టుతోనే? సోషల్​ మీడియాలో వెటర్నరీ డాక్టర్స్​ గ్రూప్​ను క్రియేట్​ చేశారు కోల్హే. యూసుఫ్​ ఖాన్​ కూడా ఇందులో ఓ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమేశ్​ కోల్హే.. నుపుర్​ శర్మకు మద్దతుగా ఆ గ్రూప్​లో పోస్ట్​ చేయగా.. కొందరికి ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే యూసుఫ్​ ఖాన్​ హత్యకు కుట్ర పన్ని.. మిగతా వారిని ప్రేరేపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. యూసుఫ్​ ఖాన్​, ఉమేశ్​ కోల్హే మంచి స్నేహితులు అని.. కోల్హే అంత్యక్రియలకు కూడా యూసుఫ్​ ఖాన్​ హాజరయ్యారని వెల్లడించారు.

ఎన్​ఐఏ రంగంలోకి దిగలేదా? మరోవైపు.. ఎన్​ఐఏ అధికారికంగా ఇంకా కెమిస్ట్​ హత్య కేసు విచారణను తమ నియంత్రణలోకి తీసుకోలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కేసు బదిలీకి సంబంధించి.. ఎన్​ఐఏ నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని, సోమవారం వరకు అందొచ్చని అమరావతి పోలీస్​ కమిషనర్​ డా. ఆర్తి సింగ్​ ఈ మేరకు వెల్లడించారు. అయితే.. శనివారమే జాతీయ దర్యాప్తు సంస్థ కేసు విచారణ కోసం రంగంలోకి దిగినట్లు కేంద్ర హోం శాఖ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. మరోవైపు.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ఇర్ఫాన్​ ఖాన్​ను ఇప్పటికే విచారించిందని కూడా తెలిసింది.

దర్జీ హత్య విచారణ? మరోవైపు.. ఉదయ్​పుర్​ దర్జీ కన్హయ్యలాల్​ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అరెస్టైన నలుగురు నిందితులు వాడిన ఫోన్లలో.. ఇంటర్నెట్​ ప్రోటోకాల్​ డిటెయిల్స్​ రికార్డ్స్​ను ​(ఐపీడీఆర్​) విశ్లేషిస్తుంది ఎన్​ఐఏ. కరాచీ కేంద్రంగా నడిచే.. దావత్​-ఇ-ఇస్లామీ (JEI) మతపర సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. అయితే.. వీరిలో ఒకరికి జేఈఐతో దగ్గరి సంబంధాలున్నాయని అనుమానిస్తోంది కేంద్ర సంస్థ. జూన్​ 28న దర్జీ కన్హయ్యను అతడి షాపులోనే దారుణంగా చంపారు కొందరు దుండగులు.

ఈ ఘటన నిందితులకు భాజపాతో సంబంధం ఉందని కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భాజపా దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​. కన్హయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు.. భాజపా సభ్యుడని కాంగ్రెస్​ శనివారం ఆరోపించింది. మరోవైపు.. ఇవి నిరాధారమైనవని తిప్పికొట్టింది భాజపా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.