వివాహం అందరికీ ఒక చక్కని స్వప్నం. ఆ కలకు కరోనా వైరస్ అడ్డంకి కాబోదని ఓ జంట రుజువుచేసింది. పెళ్లిపీటలు ఎక్కడానికి గడియలు సమీపిస్తున్న తరుణాన వరుడు కరోనా బారినపడ్డాడు. ఏదేమైనా ఆ యువ జంట మాత్రం కొవిడ్ నిబంధనల మధ్య ఏకం కావాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి మండపంలో.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పరిమిత బంధుమిత్రులు, అధికారులు, స్నేహితుల ఆశీర్వచనాల మధ్య నూతన జీవితానికి నాందిపలికారు.
మధ్యప్రదేశ్‌లోని రత్లం పట్టణంలో ఈ వివాహం జరిగింది. పురోహితుడు భౌతికదూరం పాటిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండగా.. వధువు మెడలో వరుడు తాళిబొట్టు కట్టాడు. ఈ వివాహ వేడుకకు ముగ్గురు వ్యక్తులు హాజరయ్యారు. వీరందరూ పూర్తి రక్షణ సూట్లు ధరించారు.
ఇదీ చూడండి: వరుడికి కరోనా- పీపీఈ కిట్ ధరించిన వధువు