దేశంలోనే తొలి ఎయిర్ కండీషన్డ్(ఏసీ) రైల్వే స్టేషన్ త్వరలోనే బెంగళూరులో ప్రారంభంకానుంది. ఈ రైల్వే టెర్మినల్‌కు ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు పెట్టినట్లు కేంద్రమంత్రి పియూష్ గోయల్ శనివారం వెల్లడించారు.
-
Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1
— Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1
— Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1
— Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021
ఈ రైల్వే స్టేషన్ బయప్పనహళ్లి ప్రాంతంలో ఉంది. 2015-16లో దీనికి ఏసీ టెర్మినల్ మంజూరు చేశారు. రూ.314 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీనిని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదాపడింది.
4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంతో రోజుకు 50 వేల మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ స్టేషన్ సొంతం. ఇక్కడున్న ఏడు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రోజులు 50 రైళ్లు నడుస్తాయని అధికారులు చెప్పారు.
అత్యాధునిక వసతులు..
బయప్పనహళ్లి నుంచి ముంబయి, చెన్నై, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. విమానాశ్రయం తరహాలోనే ఈ టెర్మినల్ ముఖద్వారం రూపొందించారు. స్టేషన్ భవనం పైభాగంలో కళ్లు చెదిరే పందిరి ఏర్పాటు చేశారు. ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేలా.. అత్యాధునిక వసతులు కల్పించారు.
ఆధునిక వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, ఆహారశాలలు, ఎస్కలేటర్లు, అన్ని ప్లాట్‌ఫామ్‌లను కలిపేలా లిఫ్ట్‌లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, సబ్‌వేలు ఈ స్టేషన్ ప్రత్యేకత.
ఇదీ చూడండి: నామినేషన్ వేసిన ఎంఎన్ఎం అధినేత కమల్