పుదుచ్చేరిలో మంగళవారం శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తం 30 స్థానాల్లో 324 మంది అభ్యర్థలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- మొత్తం స్థానాలు: 30
- మొత్తం అభ్యర్థులు: 324
- ఓటర్లు: 10,04,507
పోటీలో ప్రముఖులు
- సెల్వనాదన్ (కాంగ్రెస్) - కదిర్గమమ్
- ఎం కన్నన్ (కాంగ్రెస్) - ఇందిరా నగర్
- ఎన్ రంగస్వామి (ఏఐఎన్ఆర్సీ) - తట్టంచవాడి
- స్వామినాథన్ (భాజపా) - లాస్పేట్
- రమేశ్ ప్రియంబత్ (కాంగ్రెస్) - మాహి
హామీలు..
పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని, ఏటా నిధుల పంపిణీ శాతాన్ని 25 నుంచి 40కి పెంచుతున్నట్లు భాజపా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ తమను గెలిపిస్తే.. ఉచితంగా టీ పంపిణీ సహా ఉచిత విద్యను అందిస్తామని తెలిపింది. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే పుదుచ్చేరి ప్రభుత్వం కేంద్రం వద్ద చేసిన అప్పులన్నీ మాఫీ చేస్తామని స్పష్టం చేసింది.
వీటితో పాటు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పుదుచ్చేరిలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఇదీ చదవండి : అసోం మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం