ETV Bharat / bharat

దేశ్​ముఖ్​ వ్యక్తిగత సలహాదార్లకు సీబీఐ సమన్లు - మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ వ్యక్తిగత సలహాదార్లలు

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ వ్యక్తిగత సలహాదార్లు తమ ముందు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. దేశ్​ముఖ్​పై ఉన్న అవినీతి ఆరోపణల కేసులో.. ఆయన సలహాదార్లు ప్రత్యక్ష సాక్షులని పోలీసు అధికారి పరంవీర్​ సింగ్​ పేర్కొన్న నేపథ్యంలో వారికి సమన్లు జారీ చేసింది.

Personal assistants of Deshmukh called for questioning
దేశ్​ముఖ్​ వ్యక్తిగత సలహాదార్లను ప్రశ్నించనున్న సీబీఐ
author img

By

Published : Apr 11, 2021, 12:19 PM IST

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ వ్యక్తిగత సలహాదార్లను ప్రశ్నించనుంది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). పోలీసు అధికారి పరంవీర్​ సింగ్​ చేసిన అవినీతి ఆరోపణల కేసులో.. వివరాలు వెల్లడించేందుకు సంజీవ్​ పలాండే, కుందన్​ అనే ఇద్దరు సలహాదార్లు తమ ముందు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది.

బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంవీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ మేరకు సీఎంకు ఆయన రాసిన లేఖలో పలాండే పేరును పేర్కొన్నారు. దేశ్​ముఖ్​తో జరిపిన సంభాషణకు కుందన్​ ప్రత్యక్ష సాక్షి అని సస్పెండ్​ అయిన పోలీసు అధికారి సచిన్​ వాజే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సలహాదార్లను సీబీఐ ప్రశ్నించనుంది.

పోలీసు అధికారులు పరంవీర్​ సింగ్​, సచిన్​ వాజేను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది.

ఇదీ చదవండి: 'మోదీ కోడ్ ఆఫ్​ కండక్ట్​' గా మార్చండి: దీదీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.