Coronavirus Update India: భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 2,487 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 13 మంది చనిపోయారు. ఒక్కరోజే 2,878 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్ కేసులు 18 వేల దిగువకు చేరింది. యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది. మరణాల శాతం 1.22గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,21,599
- మొత్తం మరణాలు: 5,24,214
- యాక్టివ్ కేసులు: 17,692
- కోలుకున్నవారి సంఖ్య: 42579693
Vaccination India: దేశవ్యాప్తంగా శనివారం 15 లక్షల మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 191 కోట్ల 32 లక్షల 90 వేలు దాటింది. ఒక్కరోజే 4 లక్షల 5 వేల 150కిపైగా కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజే మరో 4 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 850మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,09,18,732కు చేరింది. మరణాల సంఖ్య 62,87,813కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47,53,44,003గా ఉంది.
- అమెరికాలో 26 వేల కేసులు, 55 మరణాలు నమోదయ్యాయి.
- జర్మనీలో 40వేలకుపైగా కొత్త కేసులు, 98 మరణాలు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియా, ఇటలీ, ఫ్రాన్స్‌లో సగటున రోజుకు 30వేలకుపైగా వైరస్ బారినపడుతున్నారు.
- ఆస్ట్రేలియాలో 50 వేలకుపైగా కేసులు, జపాన్‌లో 39 వేల కేసులు నమోదయ్యాయి.
ఉత్తర కొరియాలో కరోనా పంజా విసురుతోంది. శనివారం మరో 15 మంది జ్వరం లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, అందులో ఎంతమంది కరోనాతో మరణించారనేదానిపై స్పష్టత లేదు. కొత్తగా 296,180 మందిలో జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 820,620కి చేరింది.
ఇదీ చూడండి: కొవిడ్‌తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి.. తలపట్టుకుంటున్న 'కిమ్'!