ETV Bharat / bharat

కరోనా పంజా.. కేరళలో మరో 4 వేల కేసులు - కర్ణాటక కొవిడ్ అప్​డేట్

దేశవ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది

India covid
కరోనా తగ్గుముఖం... కేరళలో మరో 4 వేల కేసులు
author img

By

Published : Nov 15, 2020, 9:54 PM IST

దేశంలో కొవిడ్​ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కేరళలో కొత్తగా 4,581 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 74 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు పెరగటం కాస్త ఊరట కలిగిస్తోంది.

  • దిల్లీలో కొత్తగా 3,235 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 95 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. దిల్లీలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,85,405గా ఉంది. ప్రస్తుతం ఉన్న యాక్టివ్​ కేసుల సంఖ్య 39,990.
  • మహారాష్ట్రలో కొత్తగా 2,544 మందికి కరోనా సోకింది. 60 మంది మరణించారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 45,974కు చేరింది. ప్రస్తుతం 84,918 యాక్టివ్ కేసులున్నాయి.
  • తమిళనాడులో ఆదివారం కొత్తగా 1,819 మందికి వైరస్​ సోకింది. 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11వేలు దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,441 యాక్టివ్​ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు పెరిగింది.
  • కర్ణాటకలో కొత్తగా 1,565 మంది వైరస్​ బారిన పడ్డారు. 21 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 11,529కు చేరింది. ప్రస్తుతం 27 వేలకు పైగా యాక్టివ్​ కేసులుండగా మొత్తం కేసుల సంఖ్య 8,61,647గా ఉంది.

ఇదీ చదవండి:దిల్లీలో కరోనాపై అమిత్​ షా ఉన్నత స్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.