ETV Bharat / bharat

కొవిడ్ వ్యాక్సిన్​కు గుండెపోటుకు సంబంధం లేదు : డాక్టర్ బలరాం భార్గవ - JN1 variant cases

Corona New Variant Latest News : దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే, గడ్డుకాలం రాకుండా గట్టెక్కవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కరోనా సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ బలరాం భార్గవ పలు సూచనలు ఈటీవీతో పంచుకున్నారు

ICMR Chief Interview
ICMR Chief Dr Balram on corona cases
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 12:21 PM IST

పెరుగుతున్న కరోనా కేసులు - ఐసీఎంఆర్, డీజీ డాక్టర్ బలరాం సూచనలు

Corona New Variant Latest News : 2019 డిసెంబర్‌లో ప్రపంచం మొత్తం కొత్త వైరస్ గురించి ఆందోళన చెందుతున్న సమయం అది. 2020 కొత్త సంవత్సరానికి ఎలా స్వాగతం పలుకుదామా అని న్యూ ఇయర్ ఈవెంట్లకు ప్లాన్ చేసుకునే బదులు భయంతో దేశమంతా వణికిన సమయం అది. అలాంటి సమయంలో దేశాన్ని, ప్రజలను ముందుకు నడిపింది ఐసీఎంఆర్.

Dr Balaram on JN1 Variant : అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్​లో కొవిడ్​తో తక్కువ మరణాలు సంభవించడంలో ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషింది. అలాంటి ప్రాణాంతక కొవిడ్ సమయంలో ఐసీఎంఆర్ డీజీగా వ్యవహరించారు డాక్టర్ బలరాం భార్గవ. అనుక్షణం కొవిడ్​తో పోరాడేందుకు పోరాడారు. అలాంటి విపత్తే మరోసారి రానున్నట్లు కనిపిస్తోంది. కొత్త వేరియంట్ జేఎన్1 రూపంలో కరోనా మరోసారి విలయం సృష్టించడానికి వస్తున్న ఈ సమయంలో ఈ వేరియంట్ గురించి, రాబోయే విలయాన్ని నివారించడం ఎలా? అనే విషయాలపై డాక్టర్ బలరాం భార్గవతో ఈటీవీ ముఖాముఖి.

కొత్త వేరియంట్​తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు

  • 1. కరోనా సమయంలో మీ ప్రెస్‌మీట్ల కోసం ప్రజలు ఎదురు చూసే వారు. మహమ్మారిపై ప్రజలకు మీరు మార్గనిర్దేశం చేశారు. కొవిడ్‌ వేళ మీ మానసిక స్థితి ఎలా ఉండేది.?

జవాబు: ఆ సమయంలో మన దేశం, ప్రజలు, సోదర సోదరీమణుల కోసమే మేమంతా పనిచేశాం. అదే మమ్మల్ని నడిపించింది.

  • 2. కొవిడ్‌ మహమ్మారికి కొన్ని నెలల్లోనే వాక్సినేషన్‌ ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ పరిశోధనల కోసం భారత్‌లో ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుంది. కొవిడ్‌కు కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్‌ వచ్చింది. అది ఎలా జరిగింది.?

జవాబు: యుద్ధ ప్రాతిపదికన పనిచేశాం. ఉమ్మడి కృషి జరిగింది. రెండు ల్యాబ్స్‌, రెండు సంస్థలు, రెండు మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేశాయి. అంతా కలిసి పనిచేయడం వల్లే వ్యాక్సిన్‌ తొందరగా అందుబాటులోకి వచ్చింది.

  • 3. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై చాలా అపొహలు అప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. ఈ అంశంపై మీరేమంటారు.?

జవాబు : దేశ పౌరులకు అభినందనలు చెబుతాను. మేము ఇచ్చిన సలహాలను వారు విన్నారు. ఈ విషయంలో వేరే ఏ దేశాలతో పోల్చినా మన ప్రజలు గొప్ప పౌరులు.

  • 4. ప్లాస్మా థెరపీలో మంచి చెడులు ఉన్నాయి. కొన్ని యాంటిబయెటిక్స్‌, మందుల వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వంటి సమస్యలు వచ్చాయి. ఇలాంటి ప్రతికూల అంశాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొన్నారు.?

జవాబు: క్షేమంగా ఎగిరే విమానం అంటూ ఏదీ ఉండదు. మనం ఎదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు సమస్యలు కచ్చితంగా వస్తాయి. సమస్యలను మనం ఎదుర్కొవాలి. పరిష్కరించాలి. క్రమంగా ముందుకెళ్లాలి. మనం అదే చేశాం. మనం 10 నిర్ణయాలు తీసుకుంటే అందులో 8 సరైనవి అయ్యాయి. మనం తప్పుగా తీసుకున్న నిర్ణయాలను మళ్లీ పునరావృతం చేయకుండా ఉన్నాం. ఇది నేర్చుకునే ప్రక్రియ. మనం అందరం నేర్చుకుంటూనే ఉన్నాం. శాస్త్రవేత్తలు, సాధారణ ప్రజలు నేర్చుకుంటూనే ఉన్నారు.

  • 5. కొవిడ్‌ తర్వాత గుండెపోటు సంబంధించిన సమస్యలు చాలా వచ్చాయి. దీనిపై చర్చ జరిగింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వల్లే గుండె సమస్యలు పెరిగాయని కొందరు అన్నారు. కొంతమంది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్లే జరిగిందని విశ్లేషించారు. మీరేమంటారు.?

జవాబు: ఈ విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. గుండెపోట్లకు కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ఏమీ సంబంధం లేదు. హృదయ సమస్యలు, గుండెపోట్లు దేశంలో చాలా సాధారణం. ఎందుకంటే మనకు చాలా రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నాయి. యువతకు కూడా ఇది వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన పరిశోధనలు కూడా చాలా ఉన్నాయి.

  • 6. కొవిడ్‌ మరణాలకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు కరోనాతో చనిపోతే వాటిని కొవిడ్‌ మరణాల కింద లెక్క వేయలేదు. ఈ అంశంపై మీరేం చెబుతారు.?

జవాబు: కరోనా మరణాలకు భారత ప్రభుత్వం చాలా శాస్త్రీయమైన నిర్వచనం ఇచ్చింది. అమెరికాలోనూ ఇలాంటి పద్ధతే పాటించారు. వేరే దేశాల్లోనూ పాటించారు కొనసాగిస్తున్నారు.

  • 7. మనకు ఇప్పటికే మూడు కొవిడ్‌ వేవ్స్‌ వచ్చాయి. మహమ్మారి తుది దశకు వచ్చిందని భావించారు. కానీ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జేఎన్‌-1 ఎలా ప్రభావం చూపుతుంది.?

జవాబు: కేరళ, కర్ణాటకలో కొన్ని కేసులు మనం చూస్తున్నాం. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్‌ఓ కూడా నిర్ధారించింది. మనం దీనిపై గట్టిగా దృష్టి పెట్టాలి.

  • 8. కరోనా కేసుల పెరుగుదలతో భయంలో ఉన్న ప్రజలకు మీరిచ్చే సందేశం.?

జవాబు: భయపడ వద్దు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి - మాస్క్ తప్పనిసరి పెట్టాల్సిందే గురూ

కరోనా కొత్త కలవరం - ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.