ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా డెల్టాప్లస్​ కేసులు!

author img

By

Published : Jun 25, 2021, 10:56 PM IST

Updated : Jun 25, 2021, 11:23 PM IST

దేశవ్యాప్తంగా కరోనా​ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కేరళలో అత్యధికంగా 11,000 కేసులు(COVID Cases) నమోదయ్యాయి. దేశ రాజధానిలో 115 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు.. డెల్టా ప్లస్​ వేరియంట్​ వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పటివరకు 51 కేసులు బయటపడ్డాయి.

delta plus variant in india, corona cases
భారత్​లో కరోనా కొత్త కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. దిల్లీలో శుక్రవారం కొత్తగా 115 కేసులు(COVID Cases) నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో కొత్తగా 11,546 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 11,056 మంది కోలుకోగా, 118 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 9,677 కేసులు బయటపడ్డాయి. 10,138మంది డిశ్చార్జ్​ అవగా.. 156 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 3,310 కేసులు నమోదవగా.. 6,524 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 114 మహమ్మారికి బలయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 226 కేసులు వెలుగులోకి వచ్చాయి. 17 మంది మృతి చెందారు.

పెరుగుతున్న కేసులు..

మరోవైపు డెల్టాప్లస్​ వేరియంట్​ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 51మందికి ఈ రకం వైరస్​ సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22 మంది కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్​ వేరియంట్​ను గుర్తించినట్లు చెప్పింది.

తమిళనాడులో 9, మధ్యప్రదేశ్​లో 7, కేరళలో 3, పంజాబ్​లో 2, గుజరాత్​లో 3,ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, రాజస్థాన్​, జమ్ముకశ్మీర్​, హరియాణా, కర్ణాటకలో ఒక్కో కేసు చొప్పున ఈ తరహా వైరస్​ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 45,000 నమూనాలను పరీక్షించగా ఈ ఫలితాలు నమోదైనట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: 'డెల్టా వేరియంట్​ను ఎదుర్కొనేందుకు చర్యలేవి?'

ఇదీ చూడండి: కొవిడ్​పై పోరులో 'డెల్టా'నే అతి పెద్ద ముప్పు!

Last Updated : Jun 25, 2021, 11:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.