కేరళలో కరోనా కేసులు (corona cases) కాస్త తగ్గాయి. కొత్తగా 16,671 కేసులు నమోదయ్యాయి. మరో 14,242 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 120 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 46.13 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 14,242 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ కేరళ ప్రభుత్వం నూతన కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. అంతేగాక..
- వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల కోసం ఇండోర్ స్టేడియాలు, ఈత కొలనులు తెరవచ్చు.
- హోటళ్లలో ఏసీల నిషేధం.
- హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లను 50 శాతం సామర్థ్యంతో తెరచుకోవచ్చు.
- హోటళ్లు తెరచుకోవచ్చు.. అయితే సిబ్బందికి పూర్తిగా టీకాలు వేయాలి.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా..
- తమిళనాడులో కొత్తగా 1,724 కేసులు నమోదయ్యాయి. 1,635 మంది కోలుకోగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,342 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 1,630 మంది కోలుకోగా.. 68 మంది మృతిచెందారు.
- గోవాలో మరో 65 మందికి కరోనా సోకినట్లు తేలగా.. హిమాచల్ ప్రదేశ్‌లో 202 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
- మహారాష్ట్రలో కొత్తగా 3,276 మందికి కరోనా సోకింది. 3,723 మంది కోలుకోగా.. 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో 787 మందికి కరోనా నిర్ధరణ కాగా.. మహమ్మారి ధాటికి 11 మంది ప్రాణాలు విడిచారు. 775మంది కోలుకున్నారు.
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా డోసుల(Vaccination In India) పంపిణీ మరో మైలు రాయిని చేరుకుంది. ప్రజలకు ఇప్పటివరకు 85.54 కోట్ల డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 94లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది.
ఇవీ చూడండి: