ETV Bharat / bharat

దిల్లీలో 4.35శాతానికి పాజిటివిటీ రేటు.. 'మహా'లో ఆగని ఉద్ధృతి - మహారాష్ట్ర కేసులు

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.35 శాతానికి చేరింది. మరోవైపు.. మహారాష్ట్రలో ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 2,946 మందికి వైరస్​ సోకింది.

Corona cases today
దిల్లీలో 4.35 శాతానికి పాజిటివిటీ రేటు
author img

By

Published : Jun 12, 2022, 9:53 PM IST

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే రోజువారీ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం కొత్తగా 2,946 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. అందులో ఒక్క ముంబయిలోనే 1,803 కేసులు రావటం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 16వేల మార్క్​ను దాటాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 79,10,577, మరణాలు 1,47,870కు చేరాయి.

రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతానికి చేరింది. ఆదివారం ఒక్కరోజే 1,432 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 77,46,337కు చేరింది. రికవరీ రేటు 97.92గా ఉంది. ఆదివారం మొత్తం 42,922 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దిల్లీలో పెరుగుదల: దేశ రాజధాని దిల్లీలోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 735 మందికి వైరస్​ సోకింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.35కు చేరింది. వరుసగా మూడో రోజు పాజిటివిటీ రేటు 3 శాతంతో 600లకుపైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దిల్లీలో కరోనా కేసులు సంఖ్య 19,12,798కి, మరణాలు 26,221కి చేరాయి.

ఇదీ చూడండి: 200కేజీల బరువు.. ఇద్దరు భార్యలు.. ఈ భారీకాయుడి మెనూ చూస్తే..

పాత టైర్లతో డైనోసర్లు, డ్రాగన్లు.. 'పంక్చర్​ మ్యాన్'​ క్రియేటివిటీ సూపర్ గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.