Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 4,777 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. 5,196 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,68,114
- మరణాలు: 5,28,510
- యాక్టివ్ కేసులు: 43,994
- రికవరీలు: 4,39,95,610
Vaccination In India :
దేశంలో మరో 15,63,151 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 217.56 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,02,283 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,16,442 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 654 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,99,73,521కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,39,756 మంది మరణించారు. మరో 4,47,725 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,98,32,435కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 64,053 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 85 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 51,269 కేసులు వెలుగుచూశాయి. మరో 111 మంది మరణించారు.
- తైవాన్‌లో 38,324 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 51 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో 38,024 కొత్త కేసులు నమోదయ్యాయి.
- దక్షిణ కొరియా 29,315 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 63 మంది మృతి చెందారు.