Coronavirus Update: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 2,897 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 54 మంది చనిపోయారు. ఒక్కరోజే 2,986 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్ కేసులు 19 వేల 500 దిగువకు చేరాయి. యాక్టివ్ కేసుల శాతం 0.05, మరణాల శాతం 1.22గా ఉంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.61 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,10,586
- మొత్తం మరణాలు: 524157
- యాక్టివ్ కేసులు: 19494
- కోలుకున్నవారి సంఖ్య: 42566935
Vaccination India: దేశవ్యాప్తంగా మంగళవారం 14 లక్షల 83 వేల 878 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్ల 67 లక్షల 50 వేలు దాటింది. ఒక్కరోజే మరో 4 లక్షల 72 వేల 190 టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం పరీక్షల సంఖ్య 84.20 కోట్లకు చేరుకుంది.
Global Corona Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా దాదాపు 6 లక్షల కేసులు వెలుగుచూశాయి. మరో 1700కుపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 51 కోట్ల 84 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 62 లక్షల 80 వేలకు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47 కోట్ల 32 లక్షల 52 వేల 343 మంది.
- జర్మనీలో రికార్డుస్థాయిలో ఒక్కరోజే లక్షకుపైగా కేసులు, 200 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో దాదాపు 60 వేల కేసులు వెలుగుచూశాయి. మరో 279 మంది కొవిడ్ వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీ, ఫ్రాన్స్‌లో 56 వేల చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 158, 123 చొప్పున మరణించారు.
- దక్షిణ కొరియాలో 50 వేల కేసులు, జపాన్‌లో 33 వేలు, బ్రెజిల్లో 20 వేల చొప్పున కేసులు వెలుగుచూశాయి.
ఇవీ చూడండి: భార్యను చంపి జైలుకు.. చేతిమీద 'ఐ లవ్ యూ' అని రాసి సూసైడ్!