Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,910 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.12 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,62,445
- క్రియాశీల కేసులు: 53,974
- మొత్తం మరణాలు: 5,28,007
- కోలుకున్నవారు: 4,38,80,464
Vaccination In India :
దేశంలో ఆదివారం 32,31,895 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 213.52 కోట్లకు చేరింది. ఒక్కరోజే 2,27,313 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 618,970 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 2,125 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 601,189,435 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,475,346 మంది మరణించారు. ఆదివారం మరో 587,620 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 586,169,762కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,17,130 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మందికిపైగా మరణించారు.
- దక్షిణ కొరియాలో 72,144 కొవిడ్ కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి.
- రష్యాలో 48,042 కొత్త కేసులు, 87 మరణాలు వెలుగుచూశాయి.
- అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్‌లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి
ఇవీ చదవండి:
రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాద మరణాలు.. రోజుకు 426 మంది బలి
'న్యాయవ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి.. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి'