Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,443 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 26 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,291 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,53,042
- మరణాలు: 5,28,429
- యాక్టివ్ కేసులు: 46,342
- రికవరీలు: 4,39,78,271
Vaccination In India :
దేశంలో బుధవారం 15,85,343 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,17,11,36,934 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,39,062 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 4,31,919 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,299 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,85,56,626చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,34,484 మంది మరణించారు. మరో 5,27,581 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,83,44,125కు చేరింది.
- జర్మనీలో 56,978 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 106 మంది మరణించారు.
- రష్యాలో 53,045 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 107 మంది మృతి చెందారు.
- అమెరికాలో 47,843 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 375 మంది మృతి చెందారు.
- తైవాన్‌లో 46,902 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 39 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 38,250 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 33 మంది మృతి చెందారు.