Corona Cases in India : దేశంలో 140 రోజుల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,300 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు విడిచారు. బుధవారం ఒక్కరోజే మహమ్మారి నుంచి 718 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.02 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే 166 కేసులు పెరిగాయని పేర్కొంది.
- మొత్తం కేసులు: 4,46,99,418
- మరణాలు: 5,30,816
- యాక్టివ్ కేసులు: 7,605
- రికవరీలు: 4,41,60,997
Vaccination In India :
దేశంలో బుధవారం 7,530 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,65,28,710కు చేరింది. బుధవారం ఒక్కరోజే 89,078 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 70,597 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 386 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 6,82,880,221కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 68,22,500 మంది మరణించారు. మరో 1,47,996 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 65,57,95,698కు చేరింది.
- దక్షిణ కొరియాలో 13,081 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 9 మంది మరణించారు.
- రష్యాలో 12,001 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 39 మంది మృతి చెందారు.
- అమెరికాలో 10,906 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 137 మంది మృతి చెందారు.
- ఫ్రాన్స్‌లో 9,762 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్‌లో కొత్తగా 4,460 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 30 మంది మృతి చెందారు.
కొవిడ్ కట్టడిపై మోదీ సమీక్ష..
దేశంలో కరోనా కేసులు, ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో.. కొవిడ్ వ్యాప్తి నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని మోదీ అన్నారు. అలాగే అన్ని రాష్ట్రాలను కొవిడ్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
వృద్ధులు, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన సలహా ఇచ్చారు. కొవిడ్ కేసుల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.