భారత్‌లో కరోనా కేసులు సోమవారంతో పోల్చితే భారీగా తగ్గాయి. కొత్తగా 31,443 మందికి వైరస్ సోకింది. రికవరీ రెటు 97.28 శాతానికి చేరింది. 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు చేరాయి. కేసులు తగ్గినా మరణాలు మాత్రం పెరిగాయి. తాజాగా 2,020 మంది వైరస్‌తో మృతి చెందారు.
మొత్తం కేసులు:3,09,07,282
మొత్తం మరణాలు: 4,10784
కోలుకున్నవారు: 3,0063720
యాక్టివ్ కేసులు: 4,32,778
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తాజాగా 17,40,325 టెస్టులు చేయగా.. మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 43,40,58,138కి చేరింది.
వ్యాక్సినేషన్:
దేశంలో ఇప్పటివరకు 38,14,67,646 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 40,65,862 డోసులు అందించినట్లు తెలిపింది.
ప్రపంచంలో కొవిడ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 3,90,026 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 6,422 మంది చనిపోయారు. కాగా 3,94,858 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 188,051,747గా ఉంది.
- అమెరికా - 34,766,404
- బ్రెజిల్ - 19,106,971
- ఫ్రాన్స్ - 5,813,899
- రష్యా - 5,808,473
- యూకే-5,155,243
ఇవీ చదవండి:కరోనా మూడో దశపై ఐఎంఏ కీలక హెచ్చరికలు