Corona cases in India: కర్ణాటకలో రోజువారీ కొత్త కేసులు ఆదివారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సోమవారం కొత్తగా 46,426 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 32 మంది మరణించారు. 41,703 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 3.62 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేరళలో సగానికి తగ్గిన కొత్త కేసులు..
కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా రోజుకు 45వేల కేసులు రాగా.. సోమవారం భారీగా తగ్గాయి. ఆదివారం(45,449)తో పోలిస్తే భారీగా తగ్గి సోమవారం కొత్తగా 26,514 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56,46, 665కు చేరింది. ప్రస్తుతం 2.60 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 171 మరణాలు సంభవించాయి.
ఆదివారం పూర్తిస్థాయి లాక్డౌన్ విధించటం, కరోనా పరీక్షలు తగ్గటమే కేసుల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. 55,557 నమూనాలు పరీక్షించినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.
మహాలో..
మహారాష్ట్రలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే 12,519 కేసులు తగ్గాయి. సోమవారం కొత్తగా 28,286 మందికి వైరస్ సోకింది. మరో 36 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 86 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న మరిన్ని రాష్ట్రాలు..
రాష్ట్రం | కొత్త కేసులు | మరణాలు |
ఆంధ్రప్రదేశ్ | 14,502 | 7 |
మధ్యప్రదేశ్ | 10,585 | 6 |
రాజస్థాన్ | 9,118 | 23 |
ఒడిశా | 7,291 | 5 |
దిల్లీ | 5,760 | 30 |
జమ్ముకశ్మీర్ | 5,394 | 8 |
తెలంగాణ | 3,980 | 3 |
గోవా | 1,387 | 5 |
ఝార్ఖండ్ | 1,269 | 8 |
పుదుచ్చేరి | 1,130 | 1 |
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'ఫిబ్రవరి 15 నాటికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం!'