ETV Bharat / bharat

'మహా'లో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 43వేల కేసులు - కేరళలో కరోనా కేసులు

Corona Cases in India: భారత్​లో పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 43వేల కేసులు నమోదయ్యాయి. కేరళలో క్రితం రోజుతో పోలిస్తే 5వేలకుపైగా అధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోనూ వైరస్​ విజృంభణ అధికంగా ఉంది.

corona-cases-in-india
కేరళలో కరోనా విజృంభణ
author img

By

Published : Jan 19, 2022, 7:33 PM IST

Updated : Jan 19, 2022, 9:38 PM IST

Corona Cases in India:దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రల వైరస్​ విలయం కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే.. 43,697 కేసులు , 49 మరణాలు నమోదయ్యాయి. 46వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,64,708 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 214 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర రాజధాని ముంబయిలో.. 6,032 కొత్త కేసులు రాగా.. 12 మంది మృతి చెందారు.

కర్ణాటకలో 40వేలు..

కర్ణాటకలో కొవిడ్​ ఉద్ధృతి అధికంగా ఉంది. బుధవారం ఒక్కరోజే 40,499 మందికి వైరస్​ సోకగా.. అందులో బెంగళూరులోనే 24,135 కేసులు రావటం గమనార్హం. మరో 21 మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 33,29,199కి, మరణాలు 38,486కు చేరాయి.

రాష్ట్రంలో టెస్టింగ్​, ఐసోలేషన్​, క్వారంటైన్​ నిబంధనలు సవరించింది కర్ణాటక ప్రభుత్వం. సాధారణ ప్రజలు, హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న కరోనా రోగులు ఏడు రోజుల తర్వాత బయటకి రావొచ్చని.. అయితే, వరుసగా మూడు రోజుల పాటు ఎలాంటి జ్వరం లేకుండా ఉండాలని స్పష్టం చేసింది.

కేరళలో 34వేల మందికి వైరస్​..

కేరళలో బుధవారం ఒక్కరోజే 34,199 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,41, 511కు చేరింది. మంగళవారం(28,481)తో పోలిస్తే.. 5,718 కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో బుధవారం 91,983 పరీక్షలు నిర్వహించామని, 1.68 లక్షల క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడిచింది.

తమిళనాడులో 30 లక్షల మార్క్​..

తమిళనాడులో బుధవారం కొత్తగా 26వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30లక్షల మార్క్​ను దాటింది. 35 మంది మరణించగా.. మృతుల సంఖ్య 37,073కు చేరింది.

యూపీలో 17వేలు..

ఉత్తర్​ప్రదేశ్​లో బుధవారం కొత్తగా 17,776 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 98,238కి చేరింది. మరో ఏడుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 22,990కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క లఖ్​నవూలోనే 3,516 మందికి వైరస్​ సోకటం ఆందోళన కలిగిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసులు..

రాష్ట్రంకేసులు మరణాలు
గుజరాత్​20,966 12
దిల్లీ13,785 35
ఒడిశా11,6076
బంగాల్​ 11,447 38
ఆంధ్రప్రదేశ్10,0578
మధ్యప్రదేశ్​7,597 5
జమ్ముకశ్మీర్​5,8184
గోవా3,9367
తెలంగాణ3,5573
పుదుచ్చేరి1,8493
లద్దాఖ్9650

Last Updated : Jan 19, 2022, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.