భారత్‌లో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 7,579 మంది (Covid cases in India) వైరస్ బారిన పడ్డారు. మరో 236 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.
కొత్త కేసులు భారత్‌లో 543 రోజుల కనిష్ఠానికి చేరుకోగా.. యాక్టివ్ కేసులు 536 రోజుల కనిష్ఠానికి దిగొచ్చాయి.
యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో ఒక శాతం కంటే దిగువనే ఉన్నాయి. ప్రస్తుతం 0.33 శాతం వద్ద ఉంది. 2020 మార్చి నుంచి ఇవే అత్యల్పం.
కొత్త కేసుల్లో దాదాపు సగం అంటే.. 3,698 కేరళ నుంచే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో సోమవారం మరో 75 మంది చనిపోయారు.
రికవరీ రేటు 98.32 శాతానికి చేరడం గమనార్హం.
- మొత్తం కేసులు: 3,45,26,480
- మొత్తం మరణాలు: 4,66,147
- యాక్టివ్ కేసులు: 1,13,584
- మొత్తం కోలుకున్నవారు: 3,39,46,749
నిర్ధరణ పరీక్షలు..
భారత్‌లో నవంబరు 22న 9,64,980 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య(India Covid test report) 633,489,239కి చేరింది.
వ్యాక్సినేషన్..
భారత్‌లో మొత్తం టీకా డోసుల(Vaccination in India) పంపిణీ 117, 63, 73, 499కి చేరింది. సోమవారం ఒక్కరోజే 71 లక్షల డోసులు పంపిణీ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసులు (coronavirus worldwide) పెరుగుతున్నాయి. కొత్తగా 465,486 మందికి కొవిడ్ (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 5,828 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,84,14,197కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51,74,612కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 74,156 మందికి వైరస్ సోకగా.. మరో 516 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 35,681 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,241 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 44 వేల మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 45 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 24 వేల మంది వైరస్ బారిన పడగా.. 193 మంది మరణించారు.
- జర్మనీలో కొత్తగా మరో 36,860 మందికి కొవిడ్ సోకింది. 60 మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రధానికి కరోనా..
బెల్జియం నుంచి తిరిగివచ్చిన ఫ్రాన్స్ ప్రధాని (France prime minister) జీన్ కాస్టెక్స్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు అధికారులు సోమవారం ప్రకటించారు. 10 రోజుల పాటు ఆయన ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: భార్యకు ప్రేమతో.. అచ్చం తాజ్‌మహల్ లాంటి ఇల్లు కానుక