Corona Cases in India : భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 175 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,79,131
- మరణాలు: 5,30,707
- యాక్టివ్ కేసులు: 2,570
- రికవరీలు: 4,41,45,854
Vaccination In India :
దేశంలో మంగళవారం 48,292 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,11,71,934కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 2,01,690 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 3,49,401 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,367 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,59,48,914కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,701,180 మంది మరణించారు. మరో 3,52,513 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,79,68,352కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 89,643 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 223 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో 81,056 కొత్త కేసులు బయటపడ్డాయి. వైరస్‌తో 29 మంది మృతి చెందారు.
- జర్మనీలో కొత్తగా 36,145 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 307 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 26,211 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 203 మరణాలు నమోదయ్యాయి.
- తైవాన్‌లో కొత్తగా 25వేల కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు విడిచారు.
ఇవీ చదవండి: