బంగాల్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు షెకావత్ ఆరోపించారు.
నాలుగు వాహనాలు ధ్వంసం
రాష్ట్రంలో నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురవారం.. ఓ భాజపా కార్యకర్త ఇంటిని షెకావత్ సందర్శించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. దీంతో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి.
కట్టుదిట్టమైన భద్రతతో బయటకు
ఈ ఘటనపై చెత్లా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి షెకావత్ వెళ్లారు. అయితే 100-150 మంది టీఎంసీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. దాదాపు గంటన్నర సమయం పాటు ఆందోళన చేశారు. దీంతో అదనపు బలగాలను మోహరించి అధికారులు.. వారిని చెదరగొట్టారు. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య మంత్రిని స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు.
భాజపా అభ్యర్థిపై దాడి
అంతకుముందు అదే టీఎంసీ కార్యకర్తలు.. భవానీపుర్‌లో భాజపా అభ్యర్థి రుద్రనిల్ ఘోష్‌పై దాడి చేసినట్లు షెకావత్ ఆరోపించారు. ఘోష్ ఇంటికి వెళ్లి చంపేస్తామని.. కుటుంబ సభ్యులను అత్యాచారం చేస్తామని టీఎంసీ శ్రేణులు బెదిరించాయని చెప్పారు..
షెకావత్ ఫిర్యాదుతో కాన్వాయ్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చెత్లా పోలీసులు.
ఇదీ చూడండి: మమతా బెనర్జీకి మరోసారి ఈసీ నోటీసులు