ETV Bharat / bharat

ఆ ఇంటి కరెంట్‌ బిల్లు రూ. 829 బిలియన్లు!

author img

By

Published : Jul 22, 2021, 4:52 AM IST

విద్యుత్‌ తీగను తాకితే షాక్‌ కొడుతుందని మనకు తెలుసు. ఒక్కోసారి కరెంటు బిల్లును చూస్తేనే కళ్లు బైర్లు కమ్మి గుండెలవిసిపోతాయనేది చేదు అనుభవం. ఉత్తరప్రదేశ్​ ఆగ్రాలోని ఓ వ్యక్తికి ఆ అనుభవమే ఎదురైంది. ఆయన ఇంటికి ఏకంగా రూ. 829 బిలియన్లు కరెంట్​ బిల్లు వచ్చింది. ఈ బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

electricity bill
కరెంట్‌ బిల్లు

ఉత్తర్​ప్రదేశ్​, ఆగ్రాలో ని ఓ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే.. ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.. జులై నెలకు ఆ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు రూ. 829 బిలియన్లు.

ఇంత బిల్లు ఎలా?

ఆగ్రా, దయాల్​బాగ్​లోని సౌరభ్ ఎన్​క్లేవ్​లో సురేంద్ర ప్రతాప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటికి జులై నెలకు గానూ కరెంట్ బిల్లు రూ. 3,132 వచ్చింది. అయితే ఆన్​లైన్​లో మాత్రం ఆయన బిల్లు రూ. 829829829829.00. చూపించింది.

electricity bill
ఆన్​లైన్​లో కరెంట్ బిల్లు మొత్తం..
electricity bill
వాస్తవంగా వచ్చిన కరెంట్ బిల్లు

దీంతో ఒక్కసారిగా షాక్​కు గురైన సురేంద్ర.. విద్యుత్ అధికారులను సంప్రదించాడు. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్​లైన్​లో అలా వచ్చిందని అధికారులు వివరించటంతో ఆయన ఊపిరిపీల్చుకున్నాడు. ఈ బిల్లు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఇదీ చదవండి: Biryani: 5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.