తనపై తప్పుడు కేసు బనాయించేందుకు కొందరు కుట్ర చేస్తున్నట్లు ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ముంబయిలోని తన నివాసం చుట్టూ తిరుగుతూ కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ శుక్రవారం ట్వీట్(Nawab Malik twitter) చేశారు. కారులో ఒకరు కెమెరా, మరొకరు సెల్‌ఫోన్ పట్టుకున్న ఇద్దరి ఫొటోలను ట్యాగ్ చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ఠను మసకబార్చేందుకు ముంబయి డ్రగ్స్ కేసు దర్యాప్తు చేపట్టిన దిల్లీ నార్కోటిక్స్ విభాగాన్ని కేంద్రప్రభుత్వం ఆయుధంలా వాడుతోందని మాలిక్(Nawab Malik news) ఆరోపించారు.
తాజాగా మాజీమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లా తనను కూడా తప్పుడు కేసులో ఇరికేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు మాలిక్. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ముంబయి పోలీసు కమిషనర్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తప్పుడు కేసు బనాయించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. ఒక మంత్రిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించటం చాలా తీవ్రమైన విషయమని, దీనిపై సరైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:
'ఫడణవీస్‌కు సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి వార్త చెప్తా'
ఫడణవీస్‌పై మాలిక్ 'హైడ్రోజన్ బాంబ్'- దావూద్‌కు ముడిపెడుతూ...