ETV Bharat / bharat

గొగొయి, పటేల్​కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నివాళి

ఇటీవల మరణించిన కాంగ్రెస్​ పార్టీ దిగ్గజాలు అహ్మద్​ పటేల్​, తరుణ్​ గొగొయి​కి కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) నివాళులు అర్పించింది. పార్టీకి ఇరువురు నాయకులు చేసిన సేవలను కొనియాడారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ. పటేల్, గొగొయి​.. పార్టీకి సంపదని ప్రశంసించారు.

Congress Working Committee condoles demise of Ahmed Patel, Tarun Gogoi
'గొగొయి, పటేల్​లు కాంగ్రెస్ పార్టీ సంపద'
author img

By

Published : Nov 27, 2020, 7:00 PM IST

కాంగ్రెస్​ పార్టీ దిగ్గజ నాయకులు అహ్మద్ పటేల్​, తురుణ్​ గొగొయికి నివాళులు అర్పించింది కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ). వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ​, సీనియర్​ నాయకులు పాల్గొన్నారు.

"అహ్మద్​ పటేల్​ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీ సంపదను కోల్పోయాము. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి పటేల్​ చేసిన సేవలు ప్రశంసనీయం. కాంగ్రెస్​ అజెండానే తన అజెండాగా పనిచేశారు. పార్టీకి చేసిన కృషి వల్ల ఎంతో మంది అభిమానులు, స్నేహితులను పటేల్​ సంపాదించుకున్నారు."

--అహ్మద్​ పటేల్​ మృతిపై సీడబ్ల్యూసీ.

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయికి నాలుగు దశాబ్దాల పాటు చేసిన సేవలను కొనియాడింది సీడబ్ల్యూసీ.

" మూడు పర్యాయాలు అసోంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. పార్టీకి ఆయన సేవలు ప్రశంసనీయం. గొగొయి అసోం ప్రజల గొంతుక. అసోంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. "

-తరుణ్​ గొగొయి మృతిపై సీడబ్ల్యూసీ.

నవంబరు 23న అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి గువాహటిలో మృతి చెందగా, నవంబరు25న కాంగ్రెస్ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ గురుగ్రామ్​లో తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి: అసోం మాజీ సీఎం గొగొయి కన్నుమూత

ఇదీ చదవండి:అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రముఖుల విచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.