భారత్-పాకిస్థాన్‌ల మధ్య తిరిగి చర్చలు జరపడానికి మధ్యవర్తిలా వ్యవహరించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ముందుకొస్తుందని పాక్ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని అనుమతిస్తుందనే ఉద్దేశంతో కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే.
"భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని యూఏఈ దౌత్యవేత్త చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విదేశీ మధ్యవర్తిత్వాన్ని నివారించడానికి, ఇరుదేశాల మధ్య మధ్యవర్తులు రాకుండా ఉండటానికి.. 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. ఇది భారత్ దౌత్య విజయాల్లో ఒకటి. అయితే ఇప్పుడు భారత్-పాక్ మధ్య ఇతరులు జోక్యం చేసుకోవడమే కాదు.. కశ్మీర్ సమస్య కూడా అంతర్జాతీయ అంశంగా మారింది. భాజపా నేతృత్వంలోని కేంద్రం ఇలా చేయడం బాధాకరం."
- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత
భారత ప్రభుత్వం కారణాలు వెతుకుతుందని.. ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు ఖర్గే.
అదేం లేదు..
భారత్-పాక్‌ల మధ్య యూఏఈ జోక్యం చేసుకుంటుందని.. వచ్చిన వార్తలను తోసిపుచ్చారు పాకిస్థాన్ మాజీ రాయబారి, భారత హైకమిషనర్ జీ పార్థసారథి. 'మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించడాన్ని భారత్.. ఎప్పుడూ అంగీకరించదు. ఈ విషయంలో భారత్ చాలా స్పష్టంగా ఉంది. ఇటువంటి సమస్యలను సిద్ధాంతాల ప్రకారం.. ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటుంది' అని పార్థసారథి స్పష్టం చేశారు. విదేశీ విధానంలో ప్రతి దేశం గొప్ప పేరు కోసం ప్రయత్నిస్తుందన్నారు. అయితే యూఏఈతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు జాన్సన్ దరఖాస్తు