ETV Bharat / bharat

'హిందుత్వవాదులను గద్దె దింపి.. హిందువులకు అధికారం కట్టబెట్టాలి' - congress anti inflation rally

Congress rally in Jaipur: రాజస్థాన్​లోని జైపుర్​లో నిర్వహించిన ర్యాలీలో భాజపాపై పరోక్ష విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. నేటి భారత రాజకీయాల్లో హిందూ, హిందుత్వవాది మధ్య పోటీ నడుస్తోందని, తాను హిందువుని పేర్కొన్నారు. హిందుత్వవాదులకు అధికారమే ముఖ్యమని, 2014 నుంచి వారు అధికారంలో ఉన్నారని ఆరోపించారు. గడిచిన ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్​ చేశారు ప్రియాంక గాంధీ.

congress anti inflation rally
congress anti inflation rally
author img

By

Published : Dec 12, 2021, 2:56 PM IST

Updated : Dec 12, 2021, 8:00 PM IST

Congress rally in Jaipur: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హిందుత్వవాదులను గద్దె దింపి.. హిందువులకు అధికారం కట్టబెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. దేశంలో ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు అల్లాడుతున్నా.. అధికారం కోసం పాకులాడేవారే హిందుత్వవాదులంటూ భాజపా నేతలనుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. తన సన్నిహితులైన నలుగురు పారిశ్రామిక వేత్తలతో ఈ ఏడేళ్లలో దేశాన్ని నాశనం చేశారని విమర్శించారు. భారత దేశం హిందువులది తప్ప హిందుత్వవాదులది కాదని అన్నారు. దేశ రాజకీయాల్లో హిందువులకు.. హిందుత్వవాదికి మధ్య తీవ్ర పోటీ ఉందన్న రాహుల్‌.. మహాత్మా గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాదని తెలిపారు. తాను హిందువునని తెలిపిన రాహుల్‌.. హిందుత్వవాదిని కాదని స్పష్టం చేశారు.

ధరల పెరుగుదలను నిరసిస్తూ జైపుర్‌ వేదికగా కాంగ్రెస్​ నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు రాహుల్​.

జైపుర్​ సభలో మాట్లాడుతున్న రాహుల్​ గాంధీ

"హిందుత్వవాదులకు అధికారమే ముఖ్యం. 2014 నుంచి వారే అధికారంలో ఉన్నారు. ఆ హిందుత్వవాదులను అధికారం నుంచి దింపేసి.. హిందువులను తీసుకురావాలి. హిందుత్వవాదులు అధికారం కోసమే తమ జీవితాంతం ఆరాటపడతారు. వారికి అధికారం కన్నా ఏదీ ఎక్కువ కాదు. దాని కోసం ఏదైనా చేస్తారు. వారు సత్తాగ్రహ్​ దారిని అనుసరిస్తారు. సత్యాగ్రహాన్ని కాదు. ఈ దేశం హిందువులది, హిందుత్వవాదులది కాదు. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

దేశం మొత్తం ఐదుగురు కార్పొరేట్ల చేతిలో బందీ అయిపోయిందని, వారే కేంద్రాన్ని నడిపిస్తున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశం మొత్తం ఓ సంస్థ చేతిలో ఉండిపోయింద‌ని ప‌రోక్షంగా ఆర్​ఎస్​ఎస్​ విమర్శించిన రాహుల్‌.. ప్రభుత్వాలు కూల్చడంపైనే మోదీ శ్రద్ధ పెట్టారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నంత సేపు.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ చప్పట్లు కొడుతూ అభినందించారు. అంతకుముందు.. సోనియా చేయి పట్టుకుని రాహుల్‌గాంధీ.. సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు.

సామాన్యుల కోసం ఏం చేశారు?: ప్రియాంక

Priyanka on Modi government: కాంగ్రెస్​ పార్టీ 70 ఏళ్లలో నిర్మించిన వాటిని తన పారిశ్రామిక స్నేహితులకు అమ్మేయాలని అనుకుంటోందని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రియాంక గాంధీ. ఎన్నికలు వచ్చినప్పుడు భాజపా నేతలు చైనా లేదా ఇతర దేశాలు, కులతత్వం, మతతత్వంపై మాట్లాడుతారు తప్ప ప్రజల సమస్యల గురించి మాట్లాడరని దుయ్యబట్టారు. ఏడేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు ప్రియాంక.

" ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చేయటం మీ బాధ్యత. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవటంపై ప్రశ్నించటం మీ బాధ్యత . దేశంలోని రైతులు, ప్రజల క్షేమం కోసం పని చేయటానికి బదులుగా కొందరు పారిశ్రామికవేత్తలైన స్నేహతుల కోసమే ప్రభుత్వం పని చేస్తోంది. ప్రభుత్వాలు రెండు రకాలు ఉంటాయి. మొదటిది ప్రజలకు నిబద్ధత, నిజాయితీతో సేవ చేయటం. రెండోది అబద్ధాలు, దోచుకోవటమే లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అబద్ధాలు, దురాశే. కాంగ్రెస్​ 70 ఏళ్లలో ఏం చేసిందని పదే పదే ప్రశ్నిస్తున్నారు. 70 ఏళ్ల గురించి మాట్లాడటం మాని, ఏడేళ్లలో ఏం చేశారో చెప్పండి? "

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పైనా విమర్శలు చేశారు ప్రియాంక. ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న యోగి ప్రభుత్వం.. రైతుల కోసం ఎరువులు ఇవ్వలేకపోతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: స్వగ్రామానికి జవాన్ల పార్థివదేహాలు- భారీగా జనం హాజరు

Last Updated : Dec 12, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.