ETV Bharat / bharat

Congress Manifesto In Madhya Pradesh : రూ.25లక్షలు ఆరోగ్య బీమా.. OBCలకు 27% రిజర్వేషన్.. రాష్ట్రానికి IPL​ టీం! - five promises of congress madhya pradesh

Congress Manifesto In Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. రూ.500కే గ్యాస్ సిలిండర్​, రూ.2 లక్షల వరకు రైతుల రుణాల మాఫీ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్​నాథ్ భోపాల్​లో విడుదల చేశారు.

Congress Manifesto In Madhya Pradesh
Congress Manifesto In Madhya Pradesh
author img

By PTI

Published : Oct 17, 2023, 1:27 PM IST

Updated : Oct 17, 2023, 2:18 PM IST

Congress Manifesto In Madhya Pradesh : మధ్యప్రదేశ్​లో తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. మహిళలకు నెలకు రూ.1500 రూపాయల ఆర్థిక భరోసా కల్పిస్తామని పేర్కొంది. అలాగే రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్ అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్​ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ మేనిఫెస్టోను మంగళవారం భోపాల్​లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్​, పార్టీ నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటా ధాన్యాన్ని రూ. 2500కు కొనుగోలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అలాగే క్వింటా గోధుమలను రూ. 2600కు కొనుగోలు చేస్తామని పేర్కొంది. రాష్ట్ర పౌరులకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందిస్తామని కాంగ్రెస్​ పార్టీ వాగ్దానం చేసింది. అలాగే రాష్ట్రంలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించింది. అలాగే రాష్ట్రం తరఫున ఐపీఎల్ జట్టు ఏర్పాటు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది.

  • #WATCH | Bhopal: Congress releases the party's manifesto for the Madhya Pradesh elections

    Madhya Pradesh party president Kamal Nath, party leader Digvijaya Singh and other leaders present on the occasion. pic.twitter.com/bwi6Wgr8oS

    — ANI (@ANI) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు సహా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 59 వాగ్దానాలతో 106 పేజీల మేనిఫెస్టోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్​నాథ్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత పింఛను పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే పాఠశాల విద్యను విద్యార్థులకు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. యువతకు రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి నెలకు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్​ శాసనసభకు నవంబరు 17న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3న రానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ 144 మందితో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్​నాథ్​ను ఛింద్​వాఢా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్​ కుమారుడు జైవర్ధన్​ సింగ్​.. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో దిగారు. ఇక బుధనీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​కు పోటీగా నటుడు విక్రమ్ మస్తాల్​ను బరిలోకి దింపింది.

Madhya Pradesh Election 2023 : మధ్యప్రదేశ్​ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్.. బీజేపీ X కాంగ్రెస్​ సంగ్రామంలో విజేత ఎవరో?

మహిళా ఉద్యోగులకు సర్కార్​ గుడ్​న్యూస్.. ఏడాదికి 7 సెలవులు ఎక్స్​ట్రా!

5 States Election Date 2023 : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?

Last Updated : Oct 17, 2023, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.