ETV Bharat / bharat

శశిథరూర్, ఉత్తమ్.. అధిర్‌ స్థానంలో ఎవరు? - కాంగ్రెస్ శశిథరూర్

కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న అధిర్ రంజన్ చౌదరి స్థానంలో మరొకరిని నియమించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి ప్రధాన పోటీదారులుగా శశిథరూర్‌, మనీశ్‌ తివారీ ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది.

congress lok sabha
శశిథరూర్, ఉత్తమ్.. అధిర్‌ స్థానంలో ఎవరు?
author img

By

Published : Jul 12, 2021, 10:40 PM IST

కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం దృష్టిపెట్టింది. ఈ నెల 19నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనుండటంతో అంతకుముందే లోక్‌సభాపక్ష నేతను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్‌ పార్టీపై అసమ్మతి తెలియజేస్తూ సంస్థాగత మార్పుల కోసం గతంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లోని (జీ -23) ఒకరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా రాహుల్‌ గాంధీ మాత్రం వ్యవహరించబోరని సమాచారం.

శశిథరూర్, ఉత్తమ్ కుమార్?

ఈ పదవికి ప్రధాన పోటీదారులుగా శశిథరూర్‌, మనీశ్‌ తివారీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా గౌరవ్‌ గొగొయి, రన్‌వీత్‌ సింగ్‌ బిట్టూ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. శశిథరూర్‌, మనీశ్ తివారీ జీ-23 నేతల జాబితాలో ఉన్నారు.

ఒకే పదవి...

అధిర్‌ రంజన్‌ చౌదరిని తొలగిస్తారంటూ గత కొంత కాలంగా వినబడుతోంది. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఇప్పుడు కఠినంగా అమలు జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిర్‌ ప్రస్తుతం బంగాల్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్‌సభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. రెండు పదవులు నిర్వహిస్తున్న మిగతా వారిని కూడా ఒకదాన్నుంచి రిలీవ్‌ చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 15న సమావేశం కానుంది. రఫేల్‌ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు డిమాండ్‌ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.