Congress Leaders Met CEO Vikas Raj : కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాస్కీ, అంజన్ కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు సీఈవో వికాస్‌రాజ్‌ను కలిశారు. హైదరాబాద్‌లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని, రైతుబంధు నిధులను గుత్తేదార్లకు చెల్లించకుండా చూడాలని మొత్తం 4 అంశాలపై కాంగ్రెస్ నేతలు వికాస్‌రాజ్‌కు కంప్లైంట్ చేశారు.
ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?
ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదు: ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు నిధుల్లోంచి నచ్చిన గుత్తేదార్లకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదన్న ఆయన ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ను కోరామని స్పష్టం చేశారు.
రాజీనామా సమర్పించేందుకే కేబినెట్ భేటీ: ఈ క్రమంలోనే రేపు గెలుపు ధ్రువపత్రాలను తమ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరామని తెలిపారు. ఈ నెల 4న కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అసలు మంత్రివర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదన్నారు. రాజీనామా సమార్పించేందుకే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణలో 70.79% పోలింగ్ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది
నచ్చిన గుత్తేదార్లకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఈసీని కోరాం. ఎల్లుండి కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో మాకు తెలియదు. రాజీనామా సమర్పించేందుకే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండొచ్చు. - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - రేపు వైన్ షాపులు, రెస్టారెంట్లు బంద్