ETV Bharat / bharat

Congress Leaders Meeting Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 7:19 PM IST

Updated : Aug 31, 2023, 10:35 PM IST

telangana congresss
Tummala Nageswara Rao

19:15 August 31

Congress Leaders Meeting Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

Congress Leaders Meeting Tummala Nageswara Rao తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

Congress Leaders Meeting Tummala Nageswara Rao : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కూడిన కాంగ్రెస్‌ నేతల బృందం భేటీ (Congress Leaders met with Tummala Nageswara Rao) అయింది. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, ఇతర నాయకులు.. తుమ్మలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజులుగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. త్వరలోనే తుమ్మల నాగేశ్వరరావు హస్తం పార్టీలో చేరనున్నారు.

తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన అవసరం సమాజానికి చాలా ఉందని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకే పరిమితం కాదని.. రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే వ్యక్తి అని అన్నారు. కాంట్రాక్ట్‌ పనులు చేసే ఉపేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేను చేసింది కాంగ్రెస్‌ అని.. కానీ ఎమ్మెల్యే అవినీతికి అలవాటుపడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉపేందర్‌రెడ్డి తుమ్మలను రాజకీయాల్లో లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు అందరం ఏకం అవుతున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Tummala Nageswara Rao Interesting Comments : ఇటీవలే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి.. సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. ర్యాలీలో కేవలం ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి. అనంతరం ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని తెలిపారు. మీతో శభాష్‌ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ తలవంచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తల నరుక్కుంటా కానీ.. తలవంచనని స్పష్టం చేశారు.

MP Nama Nageswara Rao meet Tummala : అసంతృప్తులకు బుజ్జగింపులు.. తుమ్మలతో నామ భేటీ

ఈ ఎన్నికల్లో తనను తప్పించానని కొందరు ఆనందపడొచ్చని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాను ఎవరినీ నిందించ తలచుకోలేదని అన్నారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని.. జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానని పేర్కొన్నారు. కొందరు పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయవచ్చని.. ఎందరో నేతల వల్ల కానివి.. తాను చేసి చూపించినట్లు తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తుమ్మలతో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే హస్తం పార్టీలో చేరనున్నారు.

Telangana Assembly Elections 2023 : మరోవైపు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలిచేందుకు అవకాశం ఉన్న నేతలను.. సర్వేల ద్వారా దాదాపుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారిగా హస్తం పార్టీకి బలమైన నాయకత్వం లేని నియోజకవర్గాలను పీసీసీ ఇప్పటికే గుర్తించింది. అసంతృప్తిగా ఉన్న నాయకులు సైతం బీఆర్​ఎస్ నాయకత్వంపై కసితో ఉంటుండడంతో సీట్లను సర్దుబాటు చేసి టిక్కెట్లు ఇవ్వగలిగితే పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నట్లు హస్తం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా రహస్య మంతనాలు జరుగుతున్న విషయం బయటకు పోకుండా పీసీసీ జాగ్రత్త పడుతోంది.

Congress MLA Candidates Selections Controversy : కాంగ్రెస్​లో 'డబుల్'​ ట్రబుల్​.. తెరపైకి కొత్త తరహా వివాదం

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు (Joinings in Telangana Congress) ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ముగ్గురు కూడా హస్తం పార్టీలో సముచితమైన స్థానంతోపాటు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించాలని పీసీసీ వద్ద డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న.. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీతో సంప్రదించినట్లు తెలుస్తోంది.

BRS MLA Mynampally Meeting with Congress Leaders : మైనంపల్లి హనుమంతరావు మెదక్, మల్కాజ్​గిరి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలని కోరుతుండగా.. మెదక్ అసెంబ్లీతోపాటు మల్కాజ్​గిరి పార్లమెంట్ ఇవ్వడానికి పీసీసీ సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఎమ్మెల్యే సీట్లు రెండు కావాలనుకుంటే మెదక్​తో పాటు కూకట్​పల్లి తీసుకోవాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం దరఖాస్తు కూడా చేశారు. ఖానాపూర్ సీటు కోసం పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే కూడా హస్తం పార్టీతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా సమాచారం.

Congress MLA Candidates Selections Process : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. సెప్టెంబర్​ 2న మళ్లీ సమావేశం

Last Updated : Aug 31, 2023, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.