ETV Bharat / bharat

భాజపాలో చేరిన కాంగ్రెస్ కీలక నేత

author img

By

Published : Jun 9, 2021, 2:02 PM IST

Updated : Jun 9, 2021, 4:25 PM IST

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత జితిన్​ ప్రసాద.. కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ సమక్షంలో భాజపాలో చేరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన పార్టీ మారటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Jitin Prasada
కాంగ్రెస్​ నేత జితిన్​ ప్రసాద

కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్​ ప్రసాద.. భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్, పార్టీ ప్రతినిధి అనిల్​ బలుని​ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో ప్రసాద.. భాజపాలో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మాట్లాడుతున్న జితిన్​ ప్రసాద

"కాంగ్రెస్‌తో మాకు మూడు తరాల అనుబంధం ఉంది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా చర్చించాల్సి వచ్చింది. గత 8-10ఏళ్లుగా జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భాజపా మాత్రమే అని నాకు అనిపించింది. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ, ప్రజల తరఫున నిలబడే పార్టీ భాజపా. అందుకే నేను ఇందులో చేరాను"

-జితిన్‌ ప్రసాద

యూపీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జితిన్ ప్రసాద.. బంగాల్​ కాంగ్రెస్​ ఇంఛార్జిగా పని చేస్తున్నారు. ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద.. కాంగ్రెస్​లో ప్రముఖ నేత. 2004లో షాజహాన్‌పూర్‌, 2009లో ధౌరాహ్రా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు జితిన్. 2008 నుంచి 2009 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రెండోసారి యూపీఏ ప్రభుత్వంలోనూ పలు శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జితిన్‌ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే అని చెప్పాలి. మధ్య యూపీ ప్రాంతంలోని బ్రాహ్మణ వర్గంలో జితిన్‌కు గట్టి పట్టుంది. దీంతో ఆయన రాక.. భాజపాకు మంచి బూస్ట్‌ ఇచ్చినట్లైంది. కాంగ్రెస్​లో విబేధాలు, లోక్​సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓటమిపాలవటం.. భాజపాలో చేరేందుకు కారణమైనట్లు సమాచారం.

Jitin Prasada
భాజపా సభ్యత్వం అందిస్తున్న పీయూష్​ గోయల్​

2019 లోక్​సభ ఎన్నికల సమయంలో జితిన్​ ప్రసాదకు టికెట్​ లభించలేదు. అప్పుడే భాజపాలో చేరతారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అప్పుడు ప్రియాంక గాంధీ సర్దిచెప్పడం వల్ల ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. షాజాహన్​పుర్​ అత్యాచారం కేసులో ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్​ తరఫున ముందుండి పోరాడారు జితిన్​ ప్రసాద. ఇప్పుడు ఆ పార్టీని వీడి భాజపాలో చేరారు.

Jitin Prasada
కాషాయ కండువా కప్పుతున్న కేంద్ర మంత్రి

జి23లో జితిన్

కాంగ్రెస్‌ అధినాయకత్వంలో సంస్కరణలో తీసుకురావాలంటూ లేఖ రాసిన జి-23 కాంగ్రెస్‌ సభ్యుల బృందంలో జితిన్‌ కూడా ఒకరు. ఇక, రాహుల్‌ గాంధీ సన్నిహితుల్లో కాంగ్రెస్‌ను వీడిన రెండో ప్రముఖ వ్యక్తి ఈయనే. గతేడాది రాహుల్‌ మరో సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా హస్తానికి గుడ్‌బై చెప్పి భాజపాలో చేరారు.

ఇదీ చూడండి: మెక్సికోలో చెట్లు నాటేందుకు భారత 'ఫారెస్ట్​ మ్యాన్​'

Last Updated : Jun 9, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.