కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత సుష్మితా దేవ్.. కొద్ది గంటల వ్యవధిలో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. బంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఒబ్రెయన్ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు సుష్మిత.
అంతకుముందు.. కాంగ్రెస్ను వీడుతున్నట్టు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు సుష్మిత.
30ఏళ్ల పాటు కాంగ్రెస్కు సేవలందించిన.. సుష్మిత 2011లో పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సిల్చర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ ఉన్నారు. అయితే ఆమె తృణమూల్ కాంగ్రెస్లో చేరుతారని ముందునుంచే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి.
రాజీనామా అనంతరం తన ట్విట్టర్ బయోను కాంగ్రెస్ మాజీ నేత అని అప్డేట్ చేశారు సుష్మిత.
ఇదీ చూడండి: 'ఏడేళ్లుగా ప్రధాని మోదీది అదే ప్రసంగం'