ETV Bharat / bharat

'ఈ మాటలతో ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'

యూపీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఎన్​సీడబ్ల్యూ సభ్యురాలు చంద్రముఖి దేవి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యల తర్వాత మహిళలకు రక్షణ ఉంటుందా అని నిలదీశారు.

Congress General Secretary Priyanka Gandhi Vadra
'ఈ మాటలతో.. ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'
author img

By

Published : Jan 8, 2021, 6:35 PM IST

ఉత్త్రర్​ ప్రదేశ్​ హత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్​(ఎన్​సీడబ్ల్యూ) సభ్యురాలు చంద్రముఖి దేవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్​సీడబ్ల్యూ సభ్యులతో కలిసి ఘటన జరిగిన బదాయూ జిల్లాలోని గ్రామానికి వెళ్లిన చంద్రముఖి.. "ఆరోజు ఆమె బయటకు వెళ్లకపోయినా.. లేదా చిన్న పిల్లాడిని తోడు తీసుకు వెళ్లినా ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ, ఇది ముందే ప్రణాళిక ప్రకారం జరిగిన సంఘటన. ఆమెను ఫోన్​ ద్వారా పిలిచారు. తర్వాత ఆమె బయటకు వెళ్లింది" అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నేరం జరిగినందుకు బాధితురాలిని జాతీయ మహిళా కమిషన్​ సభ్యురాలు నిందిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల తర్వాత మహిళలకు రక్షణ ఉంటుందని మీరు అనుకుంటున్నారా?"

--ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

చంద్రముఖి వ్యాఖ్యలను ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ ఖండించారు.

ఆదివారం సాయంత్రం ఈ హత్యాచార ఘటన జరిగింది. బాధిత మహిళ సాయంత్రం సమయంలో గుడికి వెళ్లింది. తర్వాత మృతి చెందింది. ఈ కేసులో అర్చకుడు, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: యోగి సర్కార్ ఉద్దేశాల్లోనే లోపం: ప్రియాంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.