ETV Bharat / bharat

మహాకూటమి ఓటమిలో కాంగ్రెస్​ పాత్ర ఎంత? - బిహార్ ఎన్నికల్లో చేతులెత్తేసిన కాంగ్రెస్

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు ఫలితాల రోజు నిజం కాలేదు. మహాగట్​బంధన్ పనిచేయలేదు. ఆర్జేడీ లాంతరు వెలుగు బిహార్ సీఎం సీటుకు దారి చూపలేదు. కాంగ్రెస్ చతికిలపడటం.. కూటమిని నిండా ముంచింది. విజయానికి కొద్దిపాటి దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్ సరైన సహకారం అందించకపోవడం వల్లే మహాకూటమి ఓటమి చవిచూసిందా?

mahagathbandhan
కాంగ్రెస్ చేతులెత్తేయడమే ఓటమికి కారణమా?
author img

By

Published : Nov 10, 2020, 9:48 PM IST

బిహార్​లో మహాకూటమి బంధం విఫలమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూటమికే అనుకూలంగా ఉన్నప్పటికీ.. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తలకిందులైంది. మెజారిటీకి కావాల్సిన సీట్లను గెలిచి బిహార్​లో పాగా వేసింది ఎన్డీఏ.

ఫలితాల్లో హస్తం పార్టీ తీవ్రంగా నిరాశపరిచింది. గత ఎన్నికల్లో 27 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్.. ఈ సారి 6 స్థానాలను కోల్పోయింది. ఫలితాలను పక్కనబెడితే ప్రచార సమయంలోనూ కాంగ్రెస్ చేతులెత్తేసిన విషయం స్పష్టమవుతోంది. జాతీయ స్థాయిలో మోదీ సర్కారుకు చెక్​ పెట్టాలని చూస్తున్న హస్తం పార్టీ.. బిహార్​లో జరిగిన ఎన్నికలను ముందుండి నడిపించలేకపోయింది.

నాయకత్వ లేమి!

కూటమి కట్టినప్పటికీ మహాగట్​బంధన్​లో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ నియమించినప్పటికీ.. వారిలో అత్యధికులు ప్రచారంలో పాల్గొనలేదు. రాహుల్ గాంధీ ఎనిమిది సభలకు హాజరైనా.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ ప్రధాన వ్యూహకర్త అయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​కు సైతం స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చినప్పటికీ.. ఎన్నికల వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. సరైన నాయకత్వం లేకుండా సాగిన ప్రచార సరళి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించింది. ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొంటుంటే తేజస్వీ యాదవ్ మినహా వారిని దీటుగా ఎదుర్కొనే సరైన నాయకుడు మహా కూటమిలో కనిపించలేదు.

పట్టు లేదా?

1989 తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఉత్తమ పనితీరు చూపించింది. కానీ మళ్లీ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. 2015లో కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అశోక్ చౌదరి జేడీయూ తీర్థం పుచ్చుకోవడం పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చింది. పార్టీ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది. నేతల మధ్య సహకారం లేకుండా పోయింది. ఒక వివాదం సద్దుమణిగే సరికి రెండు వివాదాలు తెరపైకి రావడం వంటి పరిస్థితులు తలెత్తాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ పొత్తు విషయంలోనూ ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. దీంతో పట్టుసాధించే చోట మళ్లీ వెనకబడింది.

లాలూ లేకున్నా..

మరోవైపు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​.. అన్నీ తానై ప్రచార బాధ్యతలు తనపై వేసుకున్నారు. మహాగట్​ బంధన్​ను ముందుండి నడిపించారు. బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లేకున్నా ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు గెలవగలిగిందంటే దానికి ప్రధాన కారణం తేజస్వీనే. మూడు పదుల వయసున్న ఈ యువ నేత.. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎన్నికల్లో లాలూ లేని లోటును భర్తీ చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. శాసనసభ సమరం మొత్తం ఆయన కేంద్రంగానే నడిచింది. ప్రత్యర్థులు విమర్శించడానికి ఆయనకు మించిన మరో నేత కనిపించలేదు. మోదీ, నడ్డా, రాజ్​నాథ్, యోగి, నితీశ్, ఇలా ఎన్డీఏ తరఫున ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తేజస్వీ లక్ష్యంగానే విమర్శలు కురిపించారు. తేజస్వీ పేరు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయలేదు.

అయితే, తేజస్వీ యాదవ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. విమర్శలను దీటుగా ఎదుర్కొన్నారు. గట్టి సంకల్పంతో బరిలో నిలిచారు. ఎన్డీఏ నేతలను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించారు. రోజుకు రికార్డు స్థాయిలో ప్రచార సభలకు హాజరయ్యారు. యువకులను ఆకర్షించే వాగ్దానాలు ఇచ్చారు. సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తూనే రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు. కానీ హస్తం పార్టీ అగ్రనాయకత్వం నుంచి తేజస్వీకి కావాల్సిన సహకారం లభించలేదు. దీంతో ఒంటరిగానే పోరు సాగించాల్సి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.