ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

Congress election campaign: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ఉత్తర్​ప్రదేశ్​ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఇకపై ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది.

Congress public rallies hold, congres election campaign
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Jan 5, 2022, 2:17 PM IST

Congress election campaign: దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్‌ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Congress public rallies hold: యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి.. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి సామాజిక మాధ్యమాలు, వర్చువల్‌ మీడియాలోనే ప్రచారం నిర్వహించడంపై దృష్టి సారించనున్నామని పేర్కొన్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్​, గోవా, మణిపుర్​లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించనున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తెలిపారు.

"ఉత్తర్​ప్రదేశ్ సహా ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితిని పరిశీలిస్తూ.. ర్యాలీలు నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఆయా రాష్ట్రాల పార్టీ విభాగాలను మేం కోరాం."

-కేసీ వేణు గోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.

'వారిని అడ్డుకోండి..'

Congres letter to Election commission: కరోనా థర్డ్ వేవ్ ముప్పు దృష్ట్యా.. పెద్ద ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్​కు ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ లేఖ రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..​ ప్రభుత్వ డబ్బుతో వివిధ కార్యక్రమాలను ప్రారంభించకుండా, రాజకీయ ప్రకటనలు చేయకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి: 'హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి.. లేకపోతే..'

ఇదీ చూడండి: ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ముగ్గురు మంత్రులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.