కరోనా విజృంభణ వేళ ప్రభుత్వం అందిస్తున్న సాయం పంపిణీలో పారదర్శకత ఉండాలని కాంగ్రెస్ కోరింది. విదేశాల నుంచి అందుతున్న సామగ్రి వివరాలను ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"విదేశాల నుంచి అందుతున్న సాయం విషయంలో పారదర్శకత పాటించడం కోసం ఆ వివరాలను ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేయాలి. దాని వల్ల ఎక్కడి నుంచి ఈ విపత్తు సామగ్రి వస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? వంటి విషయాలను ప్రజలు తెలుసుకోగలుగుతారు. ఇది మాతో పాటు దేశ ప్రజల చేస్తున్న డిమాండ్ కూడా."
- పవన్ ఖేరా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
టీకాలు లేకపోయినా.. ప్రపంచంలో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం భారత్లో జరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెబుతున్నారని పవన్ ఖేరా విమర్శించారు. కాంగ్రెస్ను దేశం నుంచి విముక్తి చేయాలనుకున్న పార్టీ.. దేశాన్ని కొవిడ్ నుంచి విముక్తి చేయగలదని నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కొవిడ్ మృతదేహాలను పీక్కు తిన్న శునకాలు!
ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు