బంగాల్లో మూడోసారి అధికారం చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)(Surjewala on tmc) తమ పార్టీకి ప్రత్యామ్నాయం కానే కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీన పరచాలని మమత భావిస్తున్నారని ఆరోపించారు. బంగాల్ మినహా ఇతర రాష్ట్రాల్లో టీఎంసీ ఒక్క సీటు కూడా గెలవలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో(Randeep surjewala interview) ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.
భాజపాను ఢీకొట్టే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని సుర్జేవాలా తెలిపారు. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదని చెప్పారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధమైందని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తమ పార్టీ(Congress in up election 2022) ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.
"ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో(Up election priyanka gandhi) మా పార్టీనే విజయం సాధిస్తుంది. కాంగ్రెస్‌కు ఆ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. అఖిలేశ్ యాదవ్ లేదా మాయవతితో జట్టు కట్టకుండా మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. యూపీలో కాంగ్రెస్ కాకుండా మరే ఇతర రాజకీయ పార్టీ.. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేదు. హథ్రా, ఆగ్రా పోలీస్ ఎన్కౌంటర్ సందర్భాల్లో తన గళాన్ని బలంగా వినిపించింది ప్రియాంక గాంధీ మాత్రమే."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
'ఆ పొరపాటు మళ్లీ చేయం..'
"గత ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేసి, మేం పొరపాటు చేశాం. అలా చేయడం వల్ల మా అంతట మేం చిన్న పార్టీలుగా మిగిలిపోయాం. మాకు పెద్ద కలలు, ప్రణాళికలు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని కారణంగా అక్కడ అభివృద్ధి కుంటుపడింది. ఈ సారి మేం ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే ఎన్నికల పోరుకు దిగుతాం"అని సుర్జేవాలా చెప్పారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్‌కు టీఎంసీ ఝలక్- విపక్షాల భేటీకి దూరం
'అక్కడా మేమే వస్తాం..'
ఉత్తరాఖండ్‌లో వరుసగా ముఖ్యమంత్రులను మోదీ మార్చారని సుర్జేవాలా విమర్శించారు. అది దేవభూమికి అవమానం కాదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో గెలిచి.. ఉత్తరాఖండ్‌లో కూడా తామే(Congress in uttarakhand) అధికారం చేపడుతామని ధీమా వ్యక్తం చేశారు.
'సాగు చట్టాలు మళ్లీ తెస్తారు'
ఎన్నికల కోసమే నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని(Surjewala on farm laws repeal) ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని సుర్జేవాలా విమర్శించారు.
"అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయనే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్నికలు ముగియగానే మళ్లీ చట్టాలను తీసుకువస్తారు. ఇదే విషయాన్ని భాజపా నేత సాక్షి మహారాజ్ కూడా ఎప్పుడో చెప్పారు"
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
ఇదీ చూడండి: కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్ధూ ఫైర్.. నిరాహార దీక్షకు సై!
'భాజపా ఎందుకు భరించలేదు?'
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం(Salman khurshid book) 'సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్' పుస్తకంపై అడిగిన ప్రశ్నకు సుర్జేవాలా విభిన్నంగా సమాధానమిచ్చారు. "ఇంకా ముద్రించని పుస్తకంపై నేను ఏమీ చెప్పలేను. సల్మాన్ ఖుర్షీద్ వ్యక్తిగత అభిప్రాయాలపై నేను మాట్లాడను. దేవుడి పట్ల ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. భాజపా నేతలు ఈ అంశాన్ని ఎందుకు భరించలేరు? అన్ని మతాలను గౌరవించాలని భారత సంప్రదాయం మనకు చెబుతోంది. మతాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించి.. విద్వేషాలను రగలించాలని భాజపా భావిస్తోంది" అని ఆయన ఆరోపించారు.
భాజపాలా కాకుండా కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఉందని సుర్జేవాలా తెలిపారు. అందుకే పూర్తి స్థాయి అధ్యక్షుడు తమకు కావాలనే డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. జీ23 నేతల(Congress g23 leaders) డిమాండ్లపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో పంజాబ్‌లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఇదీ చూడండి: 'అధికారం కాదు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం'