దీపావళి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరంలోని సరయు నది తీరం లక్షల దీపాలతో వెలిగిపోయింది. ఒకేసారి 6లక్షల 6వేల 569 దీపాలు అయిదు నిమిషాల పాటు రామ్‌కీ పైడీ ఘాట్ల వద్ద కాంతులీనాయి. యూపీ సర్కార్ తలపెట్టిన ఈ దీపోత్సవం గిన్నీస్ బుక్ రికార్డునూ సొంతం చేసుకుంది. తాజాగా ఆ రాష్ట్ర పర్యాటక రంగానికి, రామ్ మనోహర్ లోహియా అవథ్ విశ్వవిద్యాలయానికి గిన్నిస్ బుక్ సభ్యులు అభినందనలు తెలిపారు. 6,06,569 చమురు దీపాలు అయిదు నిమిషాల పాటు వెలుగొందాయంటూ ట్వీట్ చేయడం సహా.. ఆ సుందర దృశ్యాలను షేర్ చేశారు.
-
Congratulations to @rmlauniversity and @uptourismgov for the largest display of oil lamps with 606,569 lamps remaining lit for over 5 minutes. #diwali pic.twitter.com/INETnAlAYM
— Guinness World Records Day - Nov 18 #GWRday (@GWR) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to @rmlauniversity and @uptourismgov for the largest display of oil lamps with 606,569 lamps remaining lit for over 5 minutes. #diwali pic.twitter.com/INETnAlAYM
— Guinness World Records Day - Nov 18 #GWRday (@GWR) November 16, 2020Congratulations to @rmlauniversity and @uptourismgov for the largest display of oil lamps with 606,569 lamps remaining lit for over 5 minutes. #diwali pic.twitter.com/INETnAlAYM
— Guinness World Records Day - Nov 18 #GWRday (@GWR) November 16, 2020
సీఎం అభినందనలు..
ఇదిలా ఉండగా.. ఈ దీపోత్సవాన్ని విజయవంతం చేయడంలో లోహియా విశ్వవిద్యాలయానికి చెందిన 8,000 మంది విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. వారిని, అయోధ్య యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందించారు. ఆయన 2017లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఏటా ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు దీపాల సంఖ్యను పెంచుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
ఇదీ చదవండి: మహా దీపోత్సవ వెలుగుల్లో పులకించిన అయోధ్య