ETV Bharat / bharat

'ధరల మంట'పై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు - కాంగ్రెస్ ఆందోళనలు తాజా వార్తలు

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నవంబరు 14 నుంచి కాంగ్రెస్​ పార్టీ(Congress News) ఆందోళనలు చేపట్టనుంది. 'జన్ జాగరణ్ అభియాన్' పేరుతో.. 15రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Congress
కాంగ్రెస్
author img

By

Published : Nov 10, 2021, 5:19 PM IST

నిత్యావసరాల ధరలు, ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ 15 రోజలపాటు ఆందోళనలు చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ(Congress News). 'జన్ జాగరణ్ అభియాన్' పేరుతో నవంబరు 14 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

"ధరలు పెరగటం వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటోంది. ఆర్థిక వ్యవస్థ పతనం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ రేటు పెరుగుదల, పేదరికం, ఆకలి.. తదితర కారణాలతో ప్రజల ఆకాంక్షలు దెబ్బతింటున్నాయి."

-- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

దేశంలో వంటనూనెల ధరలు సంవత్సర కాలంలో రెట్టింపయ్యాయని, కూరగాయల ధరలు సైతం 40-50 శాతం పెరిగాయని వేణుగోపాల్ తెలిపారు.

వంటగ్యాస్ ధర 50శాతం పెరిగి.. రూ. 900-1000కి చేరిందని, పెట్రోల్​ ధర ఏడాదిన్నరలో రూ.34, డీజిల్ రూ. 24కు పెరిగిందన్నారు. ఒక్క కొవిడ్​ సమయంలోనే 14కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఉద్యోగుల జీతాల్లోనూ 50శాతం కోత పడిందని గుర్తుచేశారు.

10 ఏళ్ల పాలనలో 27 కోట్లమంది భారతీయులను దారిద్ర్య రేఖ నుంచి కాంగ్రెస్ పార్టీ(Congress News) బయటకు తీసుకొచ్చిందని.. కానీ మోదీ ప్రభుత్వం 23 కోట్లమందిని పేదరికంలోకి నెట్టిందని వేణుగోపాల్ ఆరోపించారు.

ఖరీదైన హయాంగా..

మోదీ పాలనా కాలాన్ని 'ఖరీదైన హయాం'గా కేంద్ర ప్రభుత్వం నిరూపించుకుందని కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా విమర్శించారు.

'జన్ జాగరణ్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా.. ధరల పెరుగుదలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్తారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్​ నాయకులు గ్రామాల్లో పాదయాత్రలు చేపడతారని వివరించారు.

ఇదీ చూడండి: ఎంపీ ల్యాడ్స్​ నిధుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.