ETV Bharat / bharat

'ఆ డబ్బంతా మోదీ మిత్రుల జేబుల్లో ఉందా?'​ - పెట్రోధరల పెంపు

పెట్రోధరలు జీవితకాల గరిష్ఠ స్థాయిని చేరిన వేళ కేంద్రంపై కాంగ్రెస్​ తీవ్ర స్థాయిలో మండిపడింది. రేట్ల పెంపుతో వచ్చిన సొమ్మంతా మోదీకి మిత్రులైన పెట్టుబడిదారుల జేబుల్లోకి వెళ్తోందా అని ప్రశ్నించింది.

Cong slams govt over rise in fuel prices, demands rollback of central excise duty hike
ఆ డబ్బంతా ప్రధాని మోదీ మిత్రుల జేబుల్లో ఉందా?: కాంగ్రెస్​
author img

By

Published : Jan 24, 2021, 6:44 PM IST

పెట్రో ధరలు జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన నేపథ్యంలో మోదీ సర్కారుపై కాంగ్రెస్​ విరుచుకుపడింది. పెంచిన పెట్రో ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది.

"గ్యాస్, డీజిల్, పెట్రోల్​ (జీడీపీ) ధరల పెంపులో మోదీ సర్కార్​ గణనీయమైన అభివృద్ధి సాధించింది. ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధపడుతుంటే మోదీ సర్కార్ మాత్రం పన్ను వసూళ్లలో బిజీగా ఉంది"

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ మాజీ అధ్యక్షులు

మునుప్పెన్నడూ లేనంతగా లీటర్ పెట్రోల్(దిల్లీలో)​ రూ. 85.70, లీటర్​ డీజిల్​, రూ.75.88కు పెరగడంపై కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అజయ్​ మాకెన్..​ కేంద్రాన్ని విమర్శించారు.

"దిగ్భ్రాంతికి గురి చేసే విషయం ఒకటి ఉంది. 2014లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయేటప్పుడు అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర బ్యారెల్​కు 108 డాలర్లు ఉంది. అప్పుడు భారత్​లో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 71.51, డీజిల్​ ధర రూ. 57.28 ఉంది. కానీ అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు​ ధర అప్పటితో పోల్చితే ఇప్పుడు సగానికి తగ్గింది. కానీ భారత్​లో మాత్రం లీటర్​, పెట్రోల్​, డీజిల్​ ధర 85.70, 75.88కి పెరిగింది."

-అజయ్​ మాకెన్​, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

'ఆ డబ్బంతా ఎటుపోయింది?'

పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకం పెంచడం వల్ల ఆరున్నరేళ్లలో ప్రభుత్వానికి అదనంగా రూ.20 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు మాకెన్. "మరి అంత డబ్బు ఎక్కడ ఉంది? ప్రధాని మోదీ మిత్రులైన పెట్టుబడిదారుల జేబుల్లోకి వెళ్లిందా" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్​ గెలిస్తే చొరబాటుదార్లకు గేట్లు తెరిచినట్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.