ETV Bharat / bharat

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 'పోల్ ప్యానెళ్లు' - వివిధ కమిటీల బాధ్యత నిర్వహించే కాంగ్రెస్​ ప్యానెల్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్​ పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు పోల్​ ప్యానెల్స్​ను ఏర్పాటు చేసింది. వివిధ కమిటీల సభ్యులకు సూచనలిచ్చే బాధ్యతను సీనియర్​ నేతలకు అప్పజెప్పింది.

congress party key poll panels for tamil nadu polls
తమిళనాట అప్రమత్తమైన కాంగ్రెస్- ప్యానెల్​ ఏర్పాటు
author img

By

Published : Jan 2, 2021, 7:37 PM IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమవుతోంది. ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ కోసం శనివారం పోల్​ ప్యానెల్స్​​ను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలు చిదంబరం, మణి శంకర్​ అయ్యర్​లకు కీలక బాధ్యతలు అప్పగించింది.

ఎన్నిల కార్యకలాపాల కోసం మొత్తం 32మంది ఉపాధ్యక్షులు, 57మంది జనరల్​ సెక్రెటరీలు, 104 మంది సెక్రెటరీలతో జంబో ప్యానెల్​ను ఏర్పాటు చేసేందుకు పార్టీ అధిష్ఠానం ఆమోద ముద్ర వేసింది.

వివిధ కమిటీల బాధ్యత వీరిదే..

  • ఎగ్జిక్యూటివ్​ కమిటీ(56 మంది)-తమిళనాడు కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు కే ఎస్ అళగిరి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, అయ్యర్​, పలువురు మంత్రుల ఆధ్వర్యంలో పనిచేయనుంది.
  • ఎన్నికల కమిటీ (34)-అళగిరి, కాంగ్రెస్​ సభా పక్ష నేత కే ఆర్ రామస్వామి, చిందంబరం, అయ్యర్
  • ఎన్నికల కో-ఆర్డినేషన్ ప్యానెల్​(19)- మాజీ ఎంపీ ఈవీకేఎస్ ఎలంగోవన్.
  • మేనిఫెస్టో కమిటీ- మాజీ ఎంపీ ఎస్ పీటర్ ఆల్ఫోన్స్, అయ్యర్, కార్తీ చిదంబరం, ఠాగూర్, జోతిమణి.
  • ఎలక్షన్​ ప్రొపగండ/ర్యాలీ కమిటీ- ఎంపీ ఎస్​యూ. తిరుననవుక్కరసర్ (ఛైర్మన్)
  • పబ్లిసిటీ కమిటీ- కేవీ తంగ్​కబలు(ఛైర్మన్)
  • ఎలక్షన్​ మేనేజ్​మెంట్​ టీమ్- సీఎల్​పీ నేత రామస్వామి.

ఏప్రిల్​-మే సమయంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముందుగానే​ ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ స్థానిక పార్టీ ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే)తో కూటమిగా బరిలోకి దిగనుంది.

ఇదీ చదవండి:కేరళ సముద్ర తీరాన 'బాహుబలి' శివుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.