ETV Bharat / bharat

బంగాల్​ ఎన్నికలు: 39 మందితో కాంగ్రెస్​ జాబితా

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్​ సమాయత్తమవుతోంది. బంగాల్​లో పోటీ చేస్తున్న 94 స్థానాల్లోని మరో 39 చోట్ల అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో 8 విడతల్లో పోలింగ్​ జరగనుంది.

author img

By

Published : Mar 21, 2021, 5:15 AM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల కోసం మరో 39 మంది అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించింది కాంగ్రెస్​. ఇప్పుడు ఐదు, ఆరు, ఏడు, ఎనిమిదో విడత ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసింది.

భవానీపూర్​ నుంచి ఎండీ షాదాబ్​ ఖాన్, కోల్​కతా పోర్ట్​ నుంచి ఎండీ ముఖ్తార్ బరిలోకి దిగనున్నారు. రాస్​బిహార్​ స్థానం నుంచి అషుతోష్​ ఛటర్జీ పోటీలో ఉన్నారు. ​

బంగాల్​ ఎన్నికల్లో కాంగ్రెస్.. వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. కొత్త పార్టీ ఇండియన్​ సెక్యులర్​ ఫ్రంట్​ కూడా ఈ కూటమిలో భాగంగా ఉంది. ​మొత్తం 294 స్థానాల్లో 92 చోట్ల కాంగ్రెస్​ పోటీకి దిగుతోంది.

రాష్ట్రంలో మార్చి 27 నుంచి మొత్తం 8 విడతల్లో పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.

ఇవీ చూడండి:

మూడోసారి గెలిస్తే 'మోదీ'కి ప్రత్యామ్నాయంగా 'దీదీ'!

ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో భారీగా నగదు సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.